బాబు బిజీ: తోపులాటలో కిందపడిన మహిళా ఎమ్మెల్యే

మంగళవారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభను కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సత్యప్రభ క్రింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
కుప్పంలో చంద్రబాబు పర్యటన మంగళవారం ఉదయం ముగిసింది. మంగళవారం ఉదయం పలువురు కార్యకర్తలు ఆర్అండ్‌బీ గెస్ట్‌హైస్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు సమస్యలపై చంద్రబాబుకు కార్యకర్తలు, ప్రజలు వినతిపత్రం సమర్పించారు. అందరి సమస్యలను బాబు సావధానంగా విన్నారు. నాలుగు మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన చంద్రబాబు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంతో సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications