• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్‌ను పిలిచింది అందుకే?: హర్వర్డ్ వైద్యులను రప్పించిన బాబు, ఎక్కడో తేడా?

|

అమరావతి: ఏపీలో ఎన్నికల వేడి గురించి చర్చ జరుగుతున్న వేళ.. సీఎంకు జనసేనానికి మధ్య భేటీ జరగబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇందులో రాజకీయ కోణమేమి లేదని తెలుస్తోంది.

చంద్రబాబుతో పవన్ మీటింగ్, కారణమిదే!

గతంలో ఉద్దానం బాధితుల సమస్యల పరిష్కారానికి పవన్ నడుం బిగించిన నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు ఆయనతో చర్చించనున్నారు. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందం సీఎంతో భేటీ అవుతుండటంతో.. ఈ సమావేశంలో పాలు పంచుకోవాల్సిందిగా పవన్‌కు కూడా ఆహ్వానం పంపారు సీఎం.

హార్వర్డ్ వైద్యుల సలహాలు:

హార్వర్డ్ వైద్యుల సలహాలు:

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై హార్వర్డ్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. సోమవారం నాడే ఈ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమయం, వేదిక విషయాల్లో మాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం. మరోవైపు సోమవారం పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉంది.

ఇద్దరూ బిజీ:

ఇద్దరూ బిజీ:

ఇటు సీఎం సైతం రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నేతలకు సలహాలు సూచనలిస్తూ బిజీగా గడుపుతున్నారు. దీంతో సోమవారమే ఈ భేటీ జరగుతుందా? లేక మరో రోజా? అన్న దానిపై సమాచారం రావాల్సి ఉంది.

కాగా, గతంలో ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన గొంతెత్తిన పవన్.. ప్రభుత్వం వీరి సమస్యలకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క ప్రాంతంలోనే కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండటానికి గల అసలు కారణాలను వెలికితీయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని కోరారు.

  Ex CM To Join Pawan Kalyan's Jana Sena Party?
  పవన్ పరిశీలన తెలుసుకునేందుకే:

  పవన్ పరిశీలన తెలుసుకునేందుకే:

  పవన్ ప్రత్యక్షంగా ఉద్దానం బాధితులతో భేటీ అయిన నేపథ్యంలో.. ఆయన ద్వారా క్షేత్ర స్థాయి పరిశీలనను తెలుసుకోవాలని సీఎం భావిస్తున్నారు. అందువల్లే హార్వర్డ్ వైద్యులతో భేటీకి పవన్ ను కూడా రావాల్సిందిగా కబురు పెట్టారు. ఉద్దానంలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో పాటు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై భేటీలో చర్చించనున్నారు.

  అది కొట్టిపారేయలేనిది:

  అది కొట్టిపారేయలేనిది:

  పవన్-చంద్రబాబు మధ్య భేటీలో రాజకీయ కోణమేది లేదని చెబుతున్నప్పటికీ.. ఎక్కడో తేడా కొడుతుందనేది చాలామంది వెలిబుచ్చుతున్న అభిప్రాయం. ఎన్నికల సమరంలో వైసీపీ ముందుగానే దిగడంతో.. చంద్రబాబు కదలికలను రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు.

  వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం కూడా ఉండే అవకాశం ఉండటంతో.. పవన్ తనకు దూరంగా జరగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు అనేవారు లేకపోలేదు. మరోవైపు పవన్ మాత్రం వామపక్షాలతో కలిసి పనిచేసే ఆలోచనను గతంలో వెలిబుచ్చారు. దీంతో బాబు-పవన్ ల దోస్తీ గతానికే పరిమితమవుతుందా?.. లేక మళ్లీ చిగురిస్తుందా? అన్నది వేచి చూడాలి.

  ఇకపోతే పవన్ టీడీపీకి రహస్య మిత్రుడు అనేవారూ లేకపోలేదు. పరోక్షంగా చంద్రబాబును గెలిపించేందుకే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్న విమర్శ కూడా ఉంది. హోదాపై చంద్రబాబును ఆయన ఎన్నడూ నిలదీయకపోవడం.. బాబుతో పవన్ విభేదించడానికి ఏమాత్రం ఇష్టపడరన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇదంతా ఇద్దరి మధ్య లోపాయకారీ ఒప్పంద ఫలితమే అన్నది చాలామంది వాదన. మరి పవన్ మదిలో ఏముందో.. ఆయన అడుగులు ఎటో.. మరికొన్ని నెలల్లో క్లారిటీ రావచ్చేమో!

  English summary
  AP CM Chandrababu Naidu called Janasena President Pawan Kalyan to discuss over Uddanam kidney patients problems.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X