కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగనా ? పెద్దిరెడ్డా ? కుప్పానికి ఎవరొస్తారో రమ్మని చంద్రబాబు సవాల్-అన్న క్యాంటీన్ ధ్వంసంపై ఫైర్

|
Google Oneindia TeluguNews

కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన సందర్భంగా దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అన్న క్యాంటీన్ కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. అన్న క్యాంటీన్ కు బయలుదేరిన చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకనే పార్టీ నేతలతో కలిసి ఆయన అన్న క్యాంటీన్ వద్దకు వెళ్లారు. అక్కడ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజని చంద్రబాబు అన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచమన్నారు. వీధి కొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్న క్యాంటీన్ ను ఇలా ధ్వంసం చేసేవారా అని ప్రశ్నించారు. ఎస్పీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు

chandrababu challenges ys jagan and peddireddy ramachadra reddy to face him in kuppam
మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని హెచ్చరించారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా దాడి చేశారని, మరి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. పోలీసులు ఉంది మాపై దాడులు చెయ్యడానికా అని నిలదీశారు.

అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నామని, బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని ఆయన తెలిపారు. మూడేళ్లలో అనేక చోట్ల తన పర్యటనలకు అడ్డంకులు సృష్టించారని, కోర్టు కూడా చీవాట్లు పెట్టిందన్నారు. అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయిందని, తమ ఇంటికి వచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి జగన్ మంత్రులను చేశాడని చంద్రబాబు ఆక్షేపించారు. దాడులు చేసి భయపెట్టి గెలవాలి అనుకుంటున్నారని, ఇలాంటి దాడులకు టీడీపీ భయపడేది లేదన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తను ప్రజలకు, మీడియాకు చూపించి టిడిపి అధినేత ప్రశ్నించారు.

chandrababu challenges ys jagan and peddireddy ramachadra reddy to face him in kuppam

వైసీపీ, పోలీసులపై న్యాయ పరంగా పోరాడుతానని, రాజకీయంగా కూడా పోరాడుతానని చంద్రబాబు తెలిపారు.
కొందరు పోలీసులు కంటే బ్రిటిష్ వాళ్లే నయం అనిపించిందన్నారు. వాళ్ల ప్రవర్తన అలా ఉందన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వారి ఇంటి వరకు రౌడీలు వస్తారని, చైతన్య వంతంగా ఉండి పోరాడాలన్నారు. వైసీపీ పతనం నేటి నుంచి ప్రారంభం అయ్యిందని, కుప్పం నుంచి ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నాన్నారు. కుప్పంలో నేడు సిగ్గు లేకుండా ఆర్టిసి బస్సులు నిలిపివేశారని, స్కూళ్లు మూసి వేశారని చంద్రబాబు ఆక్షేపించారు. తన శైలికి భిన్నంగా ఇకపై కఠినం గా వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకే ఇలా మట్లాడాల్సి వస్తుందన్నారు. ఎక్కువ కాలం మా కార్యకర్తలను కట్టడి చెయ్యడం కూడా సాధ్యం కాదన్నారు. వైసిపి వాళ్లు కూల్చిన దగ్గరే అన్న క్యాంటీన్ లో భోజనం పెడుతున్నానన్నారు. ఈ సారి మాపై దాడి జరిగితే, వాళ్ల ఇంటికి వెళ్లి కొడతామన్నారు. అన్నం పెట్టే వాడిపై చెయ్యి చేసుకోవడం నీచమన్నారు. కన్నతల్లిపై దాడి చేసినట్లేన్నారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై దాడిని తీవ్రంగా తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. అన్న క్యాంటీన్ ఇక్కడే కొనసాగుతుందన్నారు.

అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన వారికి చంద్రబాబు సవాల్ విసిరారు. మగాళ్లైతే ఇక్కడికి రావాలన్నారు.
జగన్ నువ్వు కూడా రా, రామచంద్రారెడ్డి నువ్వు కూడా రా, వైసీపీలో చిన్నా చితకా నేతలు కాదు, డీజీపీ కూడా రావాలన్నారు. రాబోయే రోజుల్లో పోలీసు వ్యవస్ధ సక్రమంగా నడవకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం.దాన్ని టీడీపీయే నడిపిస్తుందన్నారు. ఇష్టారాజ్యంగా చేస్తే ప్రజల్ని నిస్సహాయస్ధితిలో పడేస్తే పారిపోతామనుకుంటున్నారు. తనను కుప్పానికి రానీయకుండా చేస్తారా పోలీసులు అని ప్రశ్నించారు. వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో 175 సీట్లు కాదు గుండు సున్నా ఖాయమన్నారు. ఇక్కడే కావాలంటే ఉంటానని, ఎస్పీ వస్తారో, పెద్దిరెడ్డి వస్తారో, జగన్ వస్తారా రమ్మని చంద్రబాబు సవాల్ విసిరారు

English summary
tdp chief chandrababu on today challeges ys jagan and peddireddy ramachandra reddy to come to kuppam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X