జీఎస్టీXహోదా: మోడీపై బాబుకు మరో ఛాన్స్, ఢిల్లీలో వైసిపి వర్సెస్ టిడిపి
న్యూఢిల్లీ/అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై హామీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ అండగా నిలువకూడదని, జీఎస్టీ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీని ఇరుకున పెట్టే అవకాశం దొరికిందని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చలసాని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. దొంగ లెక్కల అరుణ్ జైట్లీ హామీలను ఎవరూ నమ్మవద్దన్నారు.
రేపు కేంద్రం జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టనుందని, దానికి టిడిపి మద్దతు పలకవద్దని హితవు పలికారు. ప్రత్యేక హోదా ఇస్తేనే జీఎస్టీకి మద్దతు పలుకుతామని చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య తెలుగు గడ్డ పైన పుట్టిన రుణం తీర్చుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలన్నారు. టిడిపి కేంద్రమంత్రులు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. కాగా, ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో టిడిపి, వైసిపి ఎంపీలు పోటాపోటీగా నిరసన తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.

వైయస్సార్ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ప్లకార్డులు పట్టుకున్న దృశ్యం.

టిడిపి ఎంపీలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు.

టిడిపి నేతలు
ఏపీకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని, ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టిడిపి ఎంపీలు టీజీ వెంకటేష్, మురళీ మోహన్, గల్లా జయదేవ్ తదితరులు.