తెలుగు రాష్ట్రాల కలయికపై చంద్రబాబు కామెంట్స్-వైఎస్ ను తలపిస్తూ-వారికి చెక్, వీరికి ఊరట!

సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్న వేళ అందులో పిటిషనర్ గా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కు అనుకోని వరంగా మారాయి.

జగన్ ను ఉద్దేశించి విభజనను వ్యతిరేకించమంటూ ఉండవల్లి చేసిన డిమాండ్ తో ఇరుకునపడినట్లే కనిపించిన వైసీపీ తిరిగి దాన్ని సమర్ధించి బయటపడింది. అదే సమయంలో కేసీఆర్ పార్టీ నుంచి విమర్శలు ఎదురైనా వైసీపీ స్పందించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఈ తేనెతుట్టెను వ్యూహాత్మకంగా తన ఖమ్మం టూర్ లో కదిపారు.

తెలుగు రాష్ట్రాల విలీనంపై చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల విలీనంపై చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల విలీనంపై జరుగుతున్న చర్చపై నిన్న ఖమ్మం జిల్లా టూర్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విలీనం కోరుకునేవాళ్లు బుద్ధిలేని వాళ్లంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రత్యర్ధుల్ని నేరుగానే తాకాయి. అదే సమయంలో ఇదంతా బీజేపీ ప్లాన్ గా భావిస్తున్న నేపథ్యంలో వారికీ ఊరటనిచ్చాయి.

తెలంగాణ సెంటిమెంట్ తన సొంతం అనుకుంటున్న కేసీఆర్ తో పాటు, విభజనను తాజాగా మరోసారి వ్యతిరేకించిన వైసీపీ వంటి పార్టీలకు షాకిచ్చాయి. దీంతో చంద్రబాబు కామెంట్స్ పై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి.

జగన్, కేసీఆర్ కు షాక్?

జగన్, కేసీఆర్ కు షాక్?

విభజనను సమర్ధించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసినట్లు ఉన్నాయి. తాజాగా ఉండవల్లి కామెంట్స్ కు స్పందిస్తూ వైసీపీ నేత సజ్జల మరోసారి తెలుగు రాష్ట్రాలు కలుస్తాయంటే తాము స్వాగతిస్తామంటూ వ్యాఖ్యానించారు. జగన్ ముందు నుంచీ సమైక్య వాదేనన్నారు. తద్వారా విభజనను మరోసారి వైసీపీ వ్యతిరేకించినట్లుయింది. ఇప్పుడు చంద్రబాబు అలా చెప్పేవాళ్లకు బుద్ధిలేదన్నారు.

అలాగే కేసీఆర్ కూడా ఈ వివాదంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సజ్జల వ్యాఖ్యల్ని రాజకీయంగా వాడుకునేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ కు ఆ అవకాశం లేకుండా పోతోంది. ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యల్ని కేసీఆర్ పార్టీ వ్యతిరేకించే పరిస్ధితి లేదు.

బీజేపీకి ఊరటనిచ్చారా..!

బీజేపీకి ఊరటనిచ్చారా..!

ఏపీ-తెలంగాణను తిరిగి కలిపేందుకు సుప్రీంకోర్టులో విభజన పిటిషన్లపై విచారణను ముందుకు తెచ్చారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. అదే సమయలో కేసీఆర్, జగన్ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇదంతా బీజేపీ కుట్రేనన్న చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలో ఇదే అంశాన్ని కేసీఆర్ జనంలోకి తీసుకెళ్లేందుకు, తద్వారా బీజేపీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో చంద్రబాబు విభజనను తెరపైకి తెచ్చేవాళ్లు బుద్దిలేని వాళ్లంటూ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తాత్కాలికంగా అయినా తెరపడే అవకాశముంది. అలాగే బీజేపీని ఈ అంశంపై బీఆర్ఎస్ విమర్శించే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

వైఎస్ ను మరిపించిన చంద్రబాబు?

వైఎస్ ను మరిపించిన చంద్రబాబు?

గతంలో 2009 ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణలో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ముందుగా జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో ప్రచారంలో పాల్గొన్న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ధానిక అంశాల్ని ప్రస్తావిస్తూ ముందుకెళ్లారు. తొలి విడత పోలింగ్ తెలంగాణలో ముగియగానే, ఆంధ్రా జిల్లాల్లో రెండో విడత పోలింగ్ ప్రచారానికి వెళ్లిన వైఎస్.. అప్పటి టీఆర్ఎస్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఏమైనా కశ్మీరా హైదరాబాద్ కు ఆంధ్రా వాళ్లు వెళ్లకూడదా, అక్కడ ఉద్యోగాలు చేసుకోకూడదా అని ప్రశ్నించారు. దీంతో తెలంగాణ వాదులు దీనిపై మండిపడ్డారు. చివరికి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ వ్యాఖ్యలే హైలెట్ అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు సైతం ఏపీలో విభజనపై చర్చ జరిగిన సమయంలో మౌనంగా ఉండి, తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వగానే విభజనను వ్యతిరేకించే వాళ్లు బుద్దిలేని వాళ్లంటూ చేసిన వ్యాఖ్యలు వైఎస్ ను గుర్తుచేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+