ఆయన సహా ఎవరికీ వద్దు: జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, సొంత పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని, ఈ విషయమై జేసీ సహా ఎవరికీ అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు.

చంద్రబాబును పొగిడారా? తెలుగుదేశాన్ని తిట్టారా?: జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పామర్రులో జేసీ వ్యాఖ్యలపై స్పందించారు. అంతకుముందు జేసీ పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు.

తనకు కులాభిమానం ఉందని, జగన్‌తో వెళ్లాలనుకున్నానని, కానీ విధిలేని పరిస్థితుల్లో టిడిపిలో చేరానని చెప్పారు. అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆయన మాటాలపై పరోక్షంగా స్పందించారు.

తెలంగాణ కంటే ఎక్కువ

తెలంగాణ కంటే ఎక్కువ

తెలంగాణలో లక్ష లోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారని, ఏపీలో రూ.1.50 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. అవినీతిరహిత పాలన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించకుంటే తనకు ఎస్సెమ్మెస్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ నా ఆశయం

ఇదీ నా ఆశయం

పామిడిలో నీరు ప్రగతి ఉద్యమ పైలాన్ ఆవిష్కరణ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కష్టాలున్నా, ఎక్కడా అధైర్యపడలేదన్నారు. గత ఏడాది రూ.570 కోట్ల ఇన్‌పుట్ సబ్బిడీ ఇచ్చామని, ఈ ఏడాది రూ.1,030 కోట్లు ఇన్‌పుట్ సబ్బిడీ, బీమా ఇస్తామన్నారు.

రైతులకు పెద్ద ఎత్తున రుణ మాఫీలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, గతంలో అనంతపురం జిల్లా నుంచే రైతు పోరుబాట ప్రారంభించామని, పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన ఆశయమన్నారు. వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

అందరికీ నీటి భద్రత

అందరికీ నీటి భద్రత

అందరికీ నీటి భద్రత ఇవ్వాలని తన జీవితాశయంగా మార్చుకున్నానని చంద్రబాబు చెప్పారు. 30 వేల చెక్ డ్యామ్ లలో పూడిక తీయాలని ఆదేశాలు జారీ చేశానని, మరో 20 వేల చెక్ డ్యామ్ లు నిర్మిస్తామని తెలిపారు.

విరామం కోరుకోను

విరామం కోరుకోను

అనంతపురం జిల్లాలో లక్ష పంట కుంటలు తవ్వాలని, ఈ ఏడాది బీపీటీ, పేరూరు పనులు ప్రారంభిస్తామని, పోలవరం అసాధ్యమని చాలామంది అన్నారని, మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని, 2018 నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీళ్లిస్తామని తెలిపారు.

నీరు-ప్రగతి ఉద్యమంపై 90 రోజుల పాటు ఆలోచించాలని, జూన్ 2 లోపు ప్రతి ఇంటికీ వంట గ్యాస్ ఇప్పిస్తామని చంద్రబాబు తెలిపారు. తాను నిరంతరం పని చేస్తానని, పనిలో తనకు విసుగుండదు, విరామం ఎప్పుడూ కోరుకోనని చంద్రబాబు అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh chief Minister Nara Chandrababu Naidu on Thursday counter to MP JC Diwakarar Reddy.
Please Wait while comments are loading...