సైబరాబాద్: శ్రీకాంత్‌కి బాబు కౌంటర్, సినిమాకేంద్రంగా..
హైదరాబాద్: చార్మినార్, అసెంబ్లీ, గోల్కొండ కోటను కూడా తాను కట్టానని అంటారేమోనన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సభలో కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌లను తాను నిర్మించానని చెప్పలేదని, కానీ, సైబరాబాద్‌ను తానే నిర్మించి, పేరు పెట్టానని, అది ప్రపంచవ్యాప్తంగా తెలుసునని చంద్రబాబు అన్నారు. ఒకరు కట్టిన దానిని తాను క్లెయిమ్ చేసుకోవడం లేదన్నారు.
రాజధాని విషయంలో తమ వద్ద రహస్య అజెండా ఏమీ లేదన్నారు. తమ పైన విశ్వసనీయతతో ప్రజలు తమను గెలిపించారన్నారు. తీర ప్రాంతాలే ముందుగా అభివృద్ధి చెందుతాయన్నారు. జలయజ్ఞాన్ని ధనం యజ్ఞం చేశారని ఎద్దేవా చేశారు. విశాఖను సినిమా కేంద్రంగా చేస్తామన్నారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.

డిప్యూటీ చైర్మన్‌గా సతీష్ రెడ్డి ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నూతన డిప్యూటీ ఛైర్మన్‌గా వెంకట సతీష్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు మాజీ మండలి ఛైర్మన్ చక్రపాణి ఆయన పేరును ప్రకటించారు. అనంతరం సతీష్ రెడ్డిని ఛైర్మన్ ఆసనం వరకు సభ్యులు తోక్కోని వెళ్లారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌గా ఎన్నికైన సతీష్ రెడ్డికి మున్సిపల్ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.
అటు ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి వారికి కావల్సిన సరయిన పాలన అందించేవిధంగా డిప్యూటీ ఛైర్మన్ దోహదపడాలని నారాయణ కోరారు.












Click it and Unblock the Notifications