విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఏదో సమస్య సృష్టిస్తున్నారు, నేనున్నా: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తాము ఆదుకుంటామని, అక్కడి ఏపీ విద్యార్థులు ఎవరో తెలంగాణ సర్కారే తేల్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. విజయవాడకు వచ్చిన చంద్రబాబు 9.25కు కలెక్టర్ల సమేవేశంలో పాల్గొన్నారు. ఏడు మిషన్ల అజెండాతో ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటో కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యాలు చంద్రబాబు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు దశా, దిశ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి రెండు రాష్ట్రాల్లో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తోందన్నారు.

Chandrababu criticises KCR government

ఏపీ విద్యార్థులను చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీకి సరైన పాలన అందిస్తేనే తమకు మనుగడ ఉంటుందన్నారు. పరిపాలన గాడిలో పెట్టేందుకు దశ, దిశ నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే తాము రీషెడ్యూల్ చేస్తామని హామీ ఇచ్చారు.

అధికారులు నిజాయతీగా పని చేయాలన్నారు. ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా భయపడవద్దన్నారు. నిజాయతీగా పనిచేసే అధికారులకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఒకవేళ అధికారులు తప్పుచేస్తే... తాను కూడా వారిని కాపాడలేనన్నారు.
విద్యుత్ రంగంలో తొలిసారిగా సంస్కరణలు తీసుకువచ్చింది తానేనని చెప్పారు. తాను అప్పుడు సంస్కరణలు చేపడితే అందరూ విమర్శించారన్నారు.

అయితే, తాను చేపట్టిన సంస్కరణల మూలంగా 2004 కల్లా దేశంలో మిగులు విద్యుత్ ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అప్పట్లో నిలిచిందన్నారు. అయితే కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో విద్యుత్ రంగ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానని చెప్పారు. అప్పట్లో ఐటి రంగంలో ఉన్న గ్రోత్‌ను ముందుచూపుతో కనిపెట్టి, హైదరాబాద్‌లో ఐటి రంగాన్ని అభివృద్ధి చేశానన్నారు.

తన విజన్ వల్లే సైబరాబాద్ నిర్మితమయ్యిందన్నారు. 1994లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉందని, తాను చేసిన అభివృద్ధి కారణంగా ఇప్పడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరం రూ.30 కోట్లకు చేరుకుందన్నారు. ఏపీలో పోర్టులను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలు నిర్మిస్తామన్నారు. 2029 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేస్తామన్నారు.

సీఎం సమీక్ష నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బందు రోడ్డు వైపు వేళ్లే వాహనాలను 5వ నెంబర్ రహదారి వైపు మళ్లించారు. బెంజిసర్కిల్ నుంచి వచ్చే వాహనాలను కృష్ణలంక కట్ట వైపు మళ్లించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu criticised KCR government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X