వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌రి కాసేప‌ట్లో ఢిల్లీకి చంద్ర‌బాబు..!ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల‌కు జాతీయ నేత‌ల ఆహ్వానం..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మ‌రి కాసేప‌ట్లో ఢిల్లీ వెళుతున్నారు. అమరావతి రాజధాని లో నూతనంగా నిర్మించిన హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతునట్లు సమాచారం. ఈ రాత్రికి చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న భారతీయ జనతాపార్టీ, ఎన్డీఏ వ్యతిరేక పార్టీల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టాల్సిన నిరసన కార్యకర్మాల కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

Chandrababu to Delhi for a while ..! welcoming national leaders for Dharmaporata deeksha..!!

అలాగే అమరావతిలో నిర్వహించే ధర్మాపోరాట సభ తేదీని కూడా ఈ సమావేశంలో చంద్రబాబు ప్రకటించి ఎన్డీయేతర పార్టీలన్నింటినీ ఆహ్వానించనున్నారు. గత సంవత్సర కాలంగా నిర్వహిస్తున ధర్మపోరాట దీక్షలకు ముగింపుగా కోల్ కతా సభకు ధీటుగా అమరావతిలో నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో తదుపరి యూనైట్ ఇండియా జాతీయ స్ధాయి సభల నిర్వహణపై కూడా ఇతర పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలలోపు పది రాష్ట్రాల్లో కోల్ కతా తరహా సభలు నిర్వహించాలని ఎన్డీయేతర పార్టీలు భావిస్తున్నాయి. అలాగే ఈవీఎంల ట్యాంపరింగ్ పై జాతీయ స్ధాయిలో పోరాటంపై కూడా ఈ సమావేశంలో సమాలోచనలు చేయనున్నారు. ఇటు అమ‌రావ‌తిలో బీజేపి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌శ‌న‌లు తెలుపుతూనే అటు జాతీయ నేత‌ల మ‌ద్య ఐక్య‌తా కాగానికి బాబు పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is going to Delhi. The Chief Minister would visit Delhi to invite the Supreme Court Chief Justice for the opening of a newly constructed high court temporary building in Amravati capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X