వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచయిత గడువిచ్చి 24 గంటలైనా స్పందించని చంద్రబాబు, నెక్ట్స్ స్టెప్ ఏంటీ, చట్ట ప్రకారం వెళ్తారా..?

|
Google Oneindia TeluguNews

మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వడం లేదనే అంశం అగ్గిరాజేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కామెంట్లను ట్రస్ట్ చైర్మన్ సంచయిత సీరియస్‌గా తీసుకున్నారు. తప్పుడు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలిని డిమాండ్ చేశారు. అయితే 24 గంటలవుతోన్నా చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Recommended Video

Sanchaita Gajapathi Raju VS Chandrababu క్షమాపణా లేదంటే చట్ట పరమైన చర్యలా ? || Oneindia Telugu

బాబ్బాబు.. మీ బాబుకు ఇచ్చిన ఆన్సర్ చూడండి, మాన్సాస్ ఉద్యోగుల జీతాలపై చంద్రబాబుతో సంచయిత బాబ్బాబు.. మీ బాబుకు ఇచ్చిన ఆన్సర్ చూడండి, మాన్సాస్ ఉద్యోగుల జీతాలపై చంద్రబాబుతో సంచయిత

జీతాలు చెల్లిస్తున్నామే.. చట్ట ప్రకారం చర్యలు...

జీతాలు చెల్లిస్తున్నామే.. చట్ట ప్రకారం చర్యలు...

మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లిస్తున్నామని సంచయిత స్పష్టంచేశారు. దీనికి సంబంధించి ఈవో, కరస్పాండెంట్ జారీచేసిన నోట్‌లను ట్వీట్ చేశారు. కానీ కావాలనే తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. సీనియర్ నేత, ప్రతిక్ష నేత చంద్రబాబు కామెంట్లపై ఆమె భగ్గుమన్నారు. ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

24 గంటలవుతోన్నా స్పందించని చంద్రబాబు

24 గంటలవుతోన్నా స్పందించని చంద్రబాబు

నిన్న సాయంత్రం సంచయిత ట్వీట్‌లో వార్నింగ్ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకు చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత చంద్రబాబుపై కేసు పెడతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ ఉద్యోగులకు జీతాలు ఇస్తోన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సంచయిత వర్సెస్ చంద్రబాబు వార్ ఏ వైపు దారితీస్తోందో చూడాలి.

 చంద్రబాబు ట్వీట్ చేయడంతో రగడ..

చంద్రబాబు ట్వీట్ చేయడంతో రగడ..

మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి చంద్రబాబు శుక్రవారం ట్వీట్ చేశారు. ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో వారు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్నారని తెలిపారు. 62 ఏళ్ల ట్రస్ట్ చరిత్రలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. 879 కుటుంబాలు రోడ్డెక్కడం ఎప్పుడూ చూడలేదన్నారు. ట్రస్ట్‌ను అప్రదిష్ట పాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

క్షమాపణకు డిమాండ్..

క్షమాపణకు డిమాండ్..

ట్రస్ట్‌కు కోట్ల రూపాయల ఆస్తులు, 124 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. మరీ ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలా కావడానికి కారణం ఎవరు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నలు సంధించారు. ఇలాంటి పరిస్థితికి ట్రస్ట్‌కు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. ముందుజాగ్రత్తగా ట్రస్ట్ కోసం భూములు, బాండ్లను పీవీజీ రాజు ఏర్పాటు చేశారని వివరించారు. కానీ అంతటి సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం చూసి బాధ కలుగుతుందన్నారు. దీనిపై సంచయిత నిన్ననే కౌంటర్ ఇచ్చారు. క్షమాపణ చెప్పాలని సాయంత్రం మరో ట్వీట్ చేశారు. దీనిని చంద్రబాబు స్పందించకపోవడంతో.. చట్టపర చర్యలకు ఉఫక్రమించే అవకాశం ఉంది.

English summary
tdp chief chandrababu naidu didn’t respond for Sanchaita gajapati sorry comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X