ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ఒత్తిడి... ఆ MP గురించి డైల‌మాలో ప‌డ్డ చంద్ర‌బాబునాయుడు

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌లను అన్నిర‌కాలుగా స‌మాయ‌త్తం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా వివ‌రాలు తెప్పించుకొని లోటుపాట్లు స‌రిచేస్తున్నారు. ఈ త‌రుణంలోనే ఆయ‌న గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌రికొత్త స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. ఇక్క‌డి నుంచి రెండుసార్లు ఎంపీగా విజ‌యం సాధించిన గ‌ల్లా జ‌య‌దేవ్ ఇక్క‌డే కొన‌సాగుతారా? లేదా? అనేది స్ప‌ష్టంచేయాల‌ని కొంద‌రు నేత‌లు కోరారు.

బాబును కలిసిన నియోజకవర్గాల నాయకులు

బాబును కలిసిన నియోజకవర్గాల నాయకులు


కొద్దిరోజుల క్రితం గుంటూరు లోక్‌స‌భ నియోజ‌వ‌క‌ర్గ ప‌రిధిలోని టీడీపీ నేత‌లు ప‌లువురు అధినేత చంద్ర‌బాబును క‌లిశారు. ఈసారి ఎన్నికలకు కూడా గల్లా జయదేవే ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తారా? లేదా? అనే విషయమై బాబును స్పష్టత కోరినట్లు సమాచారం. రానున్న ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని గ‌ల్లా కుటుంబం భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే గ‌ల్లా అరుణ‌కుమారి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌గిరి నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్ ఎమ్మెల్యేగా పోటీచేస్తారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త తీసుకొని ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తేనే విజ‌యావ‌కాశాలుంటాయ‌ని చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

అంగబలం, ఆర్థిక బలం రెండూ కావాలి

అంగబలం, ఆర్థిక బలం రెండూ కావాలి


ఎంపీగా పోటీచేయాలంటే అంగ‌బ‌లం, ఆర్థిక బ‌లం ఉన్న వ్య‌క్తులు అవ‌స‌రం. అటువంటివారు దొర‌క‌డం అన్ని పార్టీల‌కు క‌ష్ట‌మ‌వుతోంది. త‌న‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పోటీచేసే ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ఖ‌ర్చును కూడా భ‌రించాల్సి ఉంటుంది. గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు ప‌శ్చిమ‌, తాడికొండ‌, మంగ‌ళ‌గిరి, తెనాలి, పొన్నూరు, ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీరిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ పార్టీని గెలిపించాల్సిన బాధ్య‌త ఎంపీపై ఉంటుంది. ఎంపీ స్థానాల్లో పోటీచేయడానికి బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే వేట ప్రారంభించిన టీడీపీ అధినాయకత్వానికి గుంటూరు విషయం డైలామాలో పడేసింది.

ఇక్కట్లు ఎదుర్కొంటున్న గల్లా వ్యాపారాలు

ఇక్కట్లు ఎదుర్కొంటున్న గల్లా వ్యాపారాలు


గ‌ల్లా కుటుంబానికి ప‌లుర‌కాల వ్యాపారాలున్న‌ప్ప‌టికీ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఇబ్బందులు ఎదుర‌వుతూ వ‌చ్చాయి. ఇటీవ‌లి కాలంలో అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. రాజ‌కీయాల‌క‌న్నా వ్యాపారాలు ముఖ్య‌మ‌నే ఉద్దేశంతో గ‌ల్లా కుటుంబం ఉంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రెండింటినీ సమన్వయం చేయడం కష్టమవుతోందనే ఉద్దేశంతో గల్లా కుటుంబం రాజ‌కీయాల‌కు సాధ్య‌మైనంత దూరం పాటించాల‌నే యోచనతో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదంటే తమ సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి ఎవరో ఒకరు వారి కుటుంబం నుంచి పోటీచేస్తారా? అనేదానిపై ఇప్పటివరకు గల్లా కుటుంబం స్పష్టత ఇవ్వలేదు. దీనివల్ల గుంటూరు లోక్ సభతోపాటు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏమీ తేల్చుకోలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+