వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ-టీడీపీ డిమాండ్: చంద్రబాబుకు చుక్కలు, డైలమా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు చిక్కుల్లో పడేస్తున్నారట! తమకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని వారు కోరుతున్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలోను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని ఉన్నామని, పార్టీ పటిష్ఠతకు కృషి చేశామని, కాబట్టి తమకు ఏపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెబుతున్నారట.

తెలంగాణ నేతలతో బాబు సమావేశమైనప్పుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి వారు తీసుకు వస్తున్నారట. ఏపీలో కొన్ని నామినేటెడ్ పోస్టుల్లోనైనా తమను నియమించాలని చెబుతున్నారట. అయితే, తెలంగాణ నాయకులను ఏపీ నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట.

Chandrababu in dilemma with Telangana TDP leaders demand!

దానికి వారు ఏపీకి చెందిన కొన్ని శాఖల్లో నిపుణులు, అనుభవజ్ఞులనే కారణంతో ఉత్తరాది వారికి ప్రాధాన్యత ఇచ్చిందని, అదే విధానంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులను ఇస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారట. అంతేకాకుండా, హైదరాబాద్ నుంచే ఏపీ ప్రభుత్వం పరిపాలన వ్యవహారాలు చూస్తున్నందున్న సచివాలయ స్థాయిలో లేదా ఇతరత్రా పోస్టుల్లో తమకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారట.

ప్రధానంగా టీటీడీ పాలక మండలిలో కనీసం రెండు పోస్టులను వారు ఆశిస్తున్నారంట. ఏపీలోని నామినేటెడ్ పోస్టుల్లో తెలంగాణ వారిని నియమిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తున్న చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులను తెలంగాణ టీడీపీ నాయకులకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారట. అయితే, కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ బీజేపీ నాయకులకే ప్రాధాన్యత ఉంటుందని, తమకు అంతగా ప్రాధాన్యం ఉండదని వారు బాబుతో మొరపెట్టుకుంటున్నారట.

English summary
It is said that TDP chief Nara Chandrababu Naidu in dilemma with Telangana TDP leaders demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X