చంద్రబాబు దీపావళి కానుక ఇదేనా!

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల మోత మోగిస్తుందని, విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమాలు తప్పవని, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆక్షేపించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పథకాన్ని ప్రారంభించి, ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, నెలకు రూ.200 లబ్ధి చేకూరుస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల మోత మోగిస్తోందని ఆయన మండిపడ్డారు.

ఒక చేతితో రెండు వందలు ఇస్తూ మరో చేత్తో నాలుగు వందలు లాగేస్తున్న చంద్రబాబు
చంద్రబాబు సర్కార్ ఒక చేతితో రెండు వందల రూపాయలు ఇస్తూ, మరో చెయ్యితో నాలుగు వందలు లాక్కుంటున్నారని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు 70 శాతం వినియోగదార్లపై ప్రభావం చూపుతుందని అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసిన రాచమల్లు ఛార్జీలు పెంచితే ఊర్కోబోమని, ఉద్యమిస్తామని ప్రకటించారు.

Chandrababu Diwali gift is electricity charges hike Rachamallu Siva Prasad fire

నాలుగు నెలల్లోనే మాట తప్పిన చంద్రబాబు
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని, విద్యుత్ చార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మర్చి, నాలుగు నెలల్లోనే మాట తప్పారని అన్నారు. ఇది చంద్రబాబు దీపావళి కానుక అన్నారు. విద్యుత్ చార్జీలు కచ్చితంగా 5 ఏళ్లు ఛార్జీలు పెంచొద్దని రాచమల్లు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల వినియోగదారులపై ఏటా రూ.6073 కోట్ల భారం పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐదేళ్ళలో ప్రజల పరిస్థితి దారుణం
ఒక్కో యూనిట్‌కు రూ.1.67 పెంచడం దారుణమని రాచమల్లు విమర్శించారు. విద్యుత్ వినియోగదారులలో 70 శాతం మంది నెలకు 200-300 యూనిట్లు వాడుతున్నారని, అందుకే వారినే టార్గెట్‌ చేసి, ఛార్జీలు పెంచుతున్నారని రాచమల్లు ఆక్షేపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే కొనసాగితే, అయిదేళ్లలోప్రజల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు.

గత వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు
గత వైసీపీ హయాంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసినా , రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బొగ్గు కొరత ఏర్పడినా, తాము ఎక్కడా విద్యుత్ సరఫరాలో లోటు లేకుండా చూశామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలలకే ఛార్జీల మోత మోగిస్తోందన్నారు. అందుకు గత ప్రభుత్వం కారణమంటూ నిందిస్తున్నారని ఆక్షేపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+