ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాజెక్టు దగ్గరే పడకేస్తా: చంద్రబాబు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న కరువును తరిమికొట్టాలంటే ప్రతి నీటి బొట్టునూ వాడుకోవాలని, అందుకు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్దేశిత కాల వ్యవధిలోనే వీటిని నిర్మిస్తామని, పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయడం ద్వారా అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని అందుకే పట్టిసం వంటి ఎత్తిపోతలతో భగీరథ యత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల కోసం రాష్ట్రం సస్యశ్యామలమయ్యేలా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసం ఎత్తిపోతలకు ఆదివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఎంతోమంది ఎన్నో విధాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని, ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో ఇది మరీ దారుణమని, గోదావరి జిల్లాల రైతులు తమతోపాటు పొరుగు జిల్లాల రైతులు కూడా బాగుండాలని కోరుకుని పట్టిసంకు సహకరిస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేమని చెప్పారు.

మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

కేంద్రంపై నమ్మకం..

కేంద్రంపై నమ్మకం..

కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలపై రైతులు, ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని చంద్రబాబు చెప్పారు.

నదుల అనుసంధానం

నదుల అనుసంధానం

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఇక్కడి నుంచే నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు చెప్పారు.

డెల్లాకు అన్యాయం చేయం

డెల్లాకు అన్యాయం చేయం

గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడే ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లిస్తామని, అంతేతప్ప డెల్టా రైతులకు ఎలాంటి నష్టం చేయబోమని చంద్రబాబు అన్నారు.

ఆ రెంటినీ పూర్తి చేస్తాం

ఆ రెంటినీ పూర్తి చేస్తాం

చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతలను పూర్తి చేస్తే పశ్చిమ గోదావరికి తిరుగే ఉండదని, ఈ రెండింటినీ సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానమే తమ లక్ష్యమన్నారు.

పులివెందుల్లో తాగునీటికి ఇక్కట్లు

పులివెందుల్లో తాగునీటికి ఇక్కట్లు

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భూగర్భ జలమట్టం అథఃపాతాళానికి పడిపోయింది. ఆఖరుకి పులివెందులలో రోజువారీగా తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే పట్టిసీమకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది.

గోదావరి జలాల వాడకం..

గోదావరి జలాల వాడకం..

గోదావరిలో ఏటా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని, ఈ నీటిని కృష్ణకు మళ్లించి సాధ్యమైనంతమేర అన్ని ప్రాంతాలను బాగు చేయాలనే తపనతో ఉన్నామన ి రాష్ట్రంలో ఎక్కడా సాగు, తాగు నీటికి కొరత రాకుండా భగీరథ యత్నాలు కొనసాగుతాయని చంద్రబాబు వివరించారు.

పోలవరం పూర్తి చేస్తే...

పోలవరం పూర్తి చేస్తే...

పోలవరం నిర్మిస్తే గోదావరి జిల్లాలతోపాటు మిగతా జిల్లాల్లో పంటకు తిరుగుండదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఒకింత సహకరించాలని, రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ప్రాజెక్టు దగ్గరే పడకేస్తా..

ప్రాజెక్టు దగ్గరే పడకేస్తా..

‘‘మీరు చేసే పనులన్నీ నెలవారీ నివేదికల్లో ఉండాలి. ఏదో తూతూమంత్రంగా చేసి నాకు చెబితే సరిపోదు. నేనే స్వయంగా నెలకోసారి వచ్చి సమీక్షిస్తా. పనితీరు బాగుంటే సరేసరి. లేదంటే ప్రాజెక్టు దగ్గరే పడకేస్తా'' అంటూ చంద్రబాబు పోలవరం ఇంజనీరింగ్‌ విభాగాన్ని అప్రమత్తం చేశారు.

పోలవరం సందర్శన

పోలవరం సందర్శన

పట్టిసీమకు శంకుస్థాపన అనంతరం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు స్థలిని సందర్శించారు. అత్యంత వేగంగా పూర్తి కావాలని, ఏమి కావాలో అడగితే ఇస్తామని చంద్రబాబు అన్నారుఅంతేకానీ పనులు కాలేదని చెబితే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు.

అరుదైన అభివృద్ధిని చూస్తారు

అరుదైన అభివృద్ధిని చూస్తారు

ఏపీలో రాబోయే నాలుగైదేళ్లల్లో ఇప్పటి తరమే అరు దైన అభివృద్ధిని చూడబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అడ్డంకులు సృష్టించాలని..

అడ్డంకులు సృష్టించాలని..

రాజకీయాలు చేయాలని, అడ్డంకులు సృష్టించాలని కొందరు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారని, రాత్రింబవళ్లు కష్టపడైనా సరే రాషా్ట్రన్ని ముందుకే తీసుకువెళతానని చంద్రబాబు చెప్పారు.

విభజన తర్వాత..

విభజన తర్వాత..

విభజన తర్వాత పూర్తిగా దివాలాతీసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమయం కుదిరినప్పుడల్లా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నానని, ఈ మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధాని మోదీని కలిసి సాయం అందించాలని కోరానని, పోలవరం విషయాన్ని గుర్తు చేశానని చంద్రబాబు చెప్పారు.

నమ్మకం ఉంది..

నమ్మకం ఉంది..

రాష్ట్రానికి కేంద్రం నుంచి తగినంత సాయం లభిస్తుందన్న నమ్మకం తనకు ఉందని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేసేందుకు త్వరలో ఎనిమిది వేల కోట్లు అప్పు చేయాలని నిర్ణయించామని, సంఘంలో ప్రతి సభ్యురాలికి పది వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that every drop of Godavari will be utilised and Polavaram will be completed within four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X