రెడీ అవుతున్న చంద్రబాబు టీమ్ - వీరికి నో ఛాన్స్ - వారి కోసం ఢిల్లీకి లేఖ..!

ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు తన కొత్త టీమ్ ఏర్పాటు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తన టీమ్ లో పనిచేసిన అధికారులకు కాల్స్ చేస్తున్నారు. అంతే కాదు గత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అధికారుల కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. నిన్న మంత్రులకు శాఖలు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. సీఎంవోతో పాటు ఇతర కీలక స్ధానాల్లో ఉండాల్సిన అధికారుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తనతో పాటు సీఎంవోలో పనిచేసిన అధికారులను పిలిపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఇతర స్ధానాల్లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా టీటీడీ ఈవోగా వైసీపీ ధర్మారెడ్డి స్ధానంలో శ్యామలరావును నియమించారు. మరికొన్ని రోజుల్లో ఇతర బదిలీలు చేపట్టబోతున్నారు.

Chandrababu exercise for new team comprising seniors loyalists no chance to pro-ysrcp officials

అధికారుల బదిలీలపై చర్చించేందుకు సీఎంవో, సీఎస్, డీజీపీతో చంద్రబాబు ఇవాళ, రేపట్లో భేటీ కానున్నారు. అన్ని విభాగాల్లోనూ మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్న చంద్రబాబు వీరి నుంచి సలహాలు తీసుకోబోతున్నారు. సమర్ధులైన అధికారులతో పాటు నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా సీఎంవోలోకి గతంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను తీసుకోబోతున్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో డిప్యుటేషన్ పై పంపాలని కేంద్రానికి లేఖలు రాశారు.

అదే సమయంలో వైసీపీ పెద్దలతో అంటకాగిన ప్రతీ అధికారినీ ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతలకు దూరంగా ఉంచే విధంగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ సీఎంవోలో కీలకంగా ఉన్న శ్రీలక్ష్మితో పాటు పలువురు అధికారులకు ఈ ఐదేళ్లూ షాకులు తప్పేలా లేవు. ఇందుకు వారు కూడా ప్రిపేర్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్లేందుకు లేదా ఏపీలో తమ డిప్యుటేషన్లు రద్దు చేసుకుని వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న ఈ దరఖాస్తులు త్వరలో ఆమోదించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+