చంద్రబాబుకు జైల్లో దోమల బెడద: రఘురామ చెప్పినట్టు.. డెంగ్యూ వ్యాప్తికి కుట్ర!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు జైల్లో భద్రత కరువని, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఇదే విషయాన్ని టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
అక్రమ కేసు పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన సైకో జగన్, ఆయనకు జైల్లోనే ప్రాణహాని తలపెట్టేందుకు కుట్ర చేస్తున్నాడా? జైల్లో దోమలు ఇబ్బంది పెడుతున్నాయని 10 రోజుల కిందటే చంద్రబాబుగారు చెప్పినా జైలు అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు ప్రాణాలతో ఆటలా అంటూ టిడిపి ట్విట్టర్ వేదికగా మండిపడింది.

పది రోజులుగా విపరీతమైన దోమలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని, జైలు అధికారులకు చెప్పిన స్పందన లేకుండా పోయిందని, డెంగ్యూ తో ఖైదీలు చనిపోతున్నా.. ఆ విషయం దాచేసి టైఫాయిడ్ అని జైలు అధికారులు ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పేర్కొంది.
జైల్లో ఖైదీలు డెంగ్యూతో మృత్యువాత పడుతున్నారు. నిన్ననే 19 ఏళ్ళ సత్యనారాయణ అనే రిమాండ్ ఖైదీ డెంగ్యూతో చనిపోయాడు. పోలీసులు ఈ విషయాన్ని దాచేసి కేసు మూసేసారు. దీంతో చంద్రబాబు గారి అభిమానుల్లో ఆందోళన పెరిగింది అంటూ పేర్కొంది. చంద్రబాబు టార్గెట్ గా జగన్ రెడ్డి వికృత క్రీడ ఆడుతున్నారని, జైలు పరిసరాలు శుభ్రంగా ఉంచకుండా డెంగ్యూ వ్యాప్తి చేసే కుట్ర చేస్తున్నారని టిడిపి తన పోస్టులో పేర్కొంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాలు ఆశుభ్రంగా ఉంచి కావాలని డెంగ్యూ వ్యాప్తి చేసే కుట్ర జరుగుతుందని తెలుగు దేశం పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. చేతికి మట్టి అంటకుండా, జైల్లో ఉన్న చంద్రబాబును జగన్ టార్గెట్ చేస్తున్నారని పేర్కొంది. రఘురామకృష్ణంరాజు చెప్పినట్టు వైరస్ ఎటాక్ కి కుట్ర జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications