చూస్తున్నారుగా, ఇష్టం వచ్చినట్లుగా..: కెసిఆర్‌పై బాబు

చిత్తూరు: కేంద్ర ప్రభుత్వాన్ని, కృష్ణా రివర్‌ బోర్డు ఛైర్మన్‌ను తిడుతూ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విభజన వల్ల ఎన్ని కష్టాలు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే వరకు రైతులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. హంద్రీ నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీరు తీసుకువస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. జిల్లాను హార్టీకల్చర్‌ హబ్‌గా, మిల్క్‌ జిల్లాగా మారుస్తారని ఆయన అన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

Chandrabau

రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరలో పశువుల కోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం, ఓట్లు, సీట్ల కోసం రాషా్ట్రన్ని రెండుగా విభజించిందని... వాళ్లకు సీట్లు రాలేదు గానీ, మనకు కష్టాలు మిగిలాయని ఆయన అన్నారు. లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌కు సమస్యలు ఉన్నాయని, యువతకు ఉద్యోగాలు రావాలన్నా హైదరాబాద్‌కు వెళ్ళాలని, అక్కడకు వెళ్ళాలంటే కెసిఆర్ ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసునని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

అయినా రాష్ట్రం దెబ్బ తిన్నదని మాత్రమే మనం ఆలోచించాలని, ఇబ్బందులు ఉన్నాయని ఇంట్లో పడుకోలేదని, ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చానని, కష్టాల నుంచి బయటపడాలంటే ఏమీ చేయాలో దానికి ప్రణాళికలు సిద్ధం చేశానని ఆయన అన్నారు. ప్రజలు కలిసి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని ఆయన ఆశించారు. సెల్‌ఫోన్లపై ఉన్న శ్రద్ధ మరుగుదొడ్లపై లేదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా అంగుళ్లలో ఆయన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+