అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ .చంద్రబాబు ఒక్కరే, 151 మంది ఎమ్మెల్యేలకు బుద్ధిచెబుతారట, వైసీపీ నేతలపై గరం గరం..

|
Google Oneindia TeluguNews

రాజధాని మార్చొద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శివాలెత్తారు. దమ్ముంటే రాజధాని మార్పు పేరుతో ఎన్నికలకు వెళ్లాని వైఎస్ఆర్ సీపీ పార్టీని డిమాండ్ చేశారు. ఒకవేళ వైసీపీ మళ్లీ గెలిస్తే రాజధాని మార్చాలని సూచించారు. అప్పుడు ప్రజాభిప్రాయాన్ని తాను కూడా గౌరవిస్తానని స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని చెప్పి, 8 నెలల తర్వాత రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు.

సకల సౌకర్యాలు..

సకల సౌకర్యాలు..

అమరావతి నుంచి పాలన సాగించేందుకు అన్నీ వసతులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతగా తనపై ఉన్న కోపాన్ని రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి చూపించొద్దని కోరారు. అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాకుంటే తమకు అప్పగించాలని సూచించారు. డెవలప్ చేసి చూపిస్తామని జగన్ సర్కార్‌కు సవాల్ విసిరారు.

మౌనముని..

మౌనముని..

ఏపీ మంత్రి పేర్ని నానిపై కూడా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని తరలిపోతుంటే పేర్ని నాని మౌనంగా ఉండిపోయారన్నారు. ఓ క్యాబినెట్ మంత్రిగా అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. అంతేకాదు రాజధానిని తరలించే హై పవర్ కమిటీలో పేర్ని నాని ఉన్నందుకు సిగ్గుపడాలి అని సంచలన ఆరోపణలు చేశారు.

 నేను రె‘ఢీ'

నేను రె‘ఢీ'

తనకు వయసేమీ అయిపోలేదని వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. విశాఖలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చేసిన కామెంట్లకు చంద్రబాబు స్పందించారు. తనొక్కడినే 151 మంది ఎమ్మెల్యేలకు బుద్ధిచెప్పగలుగుతానని చెప్పారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉండగా.. వైసీపీకి మెజార్టీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే.

English summary
tdp chief chandrababu naidu fire on minister perni nani on amaravati issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X