నాశనం చేశారు, పతనం ఖాయం: కాంగ్రెస్‌పై బాబు ఫైర్

హైదరాబాద్: దేశానికి, రాష్ట్రాన్ని సమర్థవంతమైన నాయకత్వం కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం తెలుగుదేశం పార్టీ 33వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. నందమూరి తారక రావు టిడిపిని స్థాపించింది.. డబ్బు, అధికారం కోసం కాదని, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమేనని చంద్రబాబు చెప్పారు.

అవినీతి, అసమర్థ కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం నాశనమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పతనం ఖాయమని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ను ఐటి కేంద్రంగా మార్చింది తమ పార్టీనేనని చంద్రబాబు చెప్పారు.

Chandrababu fires at Congress

సింగపూర్‌తో పోటీ పడేవిధంగా సైబరాబాద్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. అమెరికా, చైనాలతో పోటీ పడే శక్తి మనదేశానికే ఉందని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం భారతదేశానికి, రాష్ట్రానికి సమర్థ నాయకత్వం కావాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయం అవినీతి రహిత భారతదేశమని అన్నారు.

అంతకుముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్ రమణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+