మోడీ ప్రభుత్వంపై నిప్పులు: చంద్రబాబుకు పుండు మీద కారం చల్లినట్లు...
Recommended Video

అమరావతి: పోలవరం ప్రాజెక్టు కొన్ని పనులకు సంబంధించిన టెండర్లను నిలిపేయాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పుండు మీద కారం చల్లినట్లు అయింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు హాజరైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఈఎస్)కు ఆహ్వానించకపోవడంపై, హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలవకపోవడంపై ఆయన ఇదివరకే అసంతృప్తితో ఉన్నారు. దీంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ లేని విధంగా నిప్పులు చెరిగారనే మాట వినిపిస్తోంది.

కెసిఆర్‌కు మోడీ దగ్గరయ్యారని...
జిఈఎస్‌ను హైదరాబాదులో నిర్వహించి, దానికి ప్రధాని మోడీ హాజరు కావడం, హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించడం ద్వారా మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు దగ్గరైనట్ల సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు. పైగా తనను ఆ రెండు ప్రధానమైన కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే ఆయన తనదైన రీతిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబుకు నచ్చలేదని అంటున్నారు.

ఎపి తరఫున నారా బ్రాహ్మణి
జిఈఎస్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హాజరయ్యారు. అలా హాజరు కావడం తనకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.

అదే సమయంలో పోలవరంపై...
జిఈఎస్, హైదరాబాద్ మెట్రో రైలు కార్యక్రమాలకు పిలువకపోవడంపై అసంతృప్తితో ఉన్న చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు పనుల టెండర్లు అపేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడం ఆగ్రహం తెప్పించిందనే చెప్పాలి. అందుకే ఆయన మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మామూలుగా అయితే కేంద్రంతో మాట్లాడుతానని చెప్పి ఉండేవారు. కానీ అందుకు విరుద్ధంగా ఆయన వాగ్బాణాలు సంధించారు.

గడ్కరీ నిరాకరించారు
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంస్థకు దక్కాయి. అయితే, నిర్మాణంలో జాప్యం వల్ల వ్యయం పెరిగిందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన అంటున్నారు. కాంట్రాక్టరును మార్చాలని చంద్రబాబు ఇదివరకు కేంద్ర మంత్రి గడ్కరీని అడిగారు. అందుకు గడ్కరీ నిరాకరించారు. ఇది కూడా చంద్రబాబు ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.












Click it and Unblock the Notifications