సాక్షిపై బాబు మళ్లీ ఆగ్రహం, పవన్ కళ్యాణ్ ప్రభావం జగన్‌పై ఉంటుందా?
అనంతపురం: సాక్షి పత్రిక రాతల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదివారం నాడు మండిపడ్డారు. అనంతపురం జిల్లాకు ప్రభుత్వ నీరు ఇవ్వడం లేదంటూ కథనాలు రాయడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కరువుతో అల్లాడుతున్న జిల్లాకు నీరు తెచ్చేందుకు తాను ప్రయత్నాలు చేస్తుంటే తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. జిల్లాకు నీళ్లు తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఇష్టానుసారంగా, బాధ్యతారాహిత్యంగా పత్రికలో రాస్తున్నారన్నారు.

కాగా, సీఎం చంద్రబాబు పంటసంజీవని కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా అమడగూరు మండలం గుండువారిపల్లెకు ఆయన వచ్చారు. జల ఫిరంగుల పని తీరును పరిశీలించారు. అనంతరం ఆయన రైతులను పరామర్శించారు.
పవన్ వ్యాఖ్యల ప్రభావం జగన్ పార్టీపై ఉంటుందా?
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసిపి పైన, ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా చేసిన ప్రసంగం నేపథ్యంలో ఆ ప్రభావం జగన్ పైన, ఆయన పార్టీ పైన ఉంటుందా అంటే లేదని అంటున్నారు వైసిపీ నేతలు. హోదా విషయంలో పవన్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. మొదటి నుంచి తాము హోదా కోసం పోరాడుతున్నామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications