బీజేపీతో పొత్తుపై తప్పుడు ప్రచారం: వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏ ప్రభుత్వం రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాగళం సభలకు వస్తున్న స్పందన చూస్తుంటే.. ఈ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. మార్కాపురం, ఎమ్మిగనూరు ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. భూస్వాములు, పెత్తందారుల పార్టీ వైసీపీ అయితే, అన్ని వర్గాల పేదలను పైకి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు నాయుడు అన్నారు.
కులాల పేరుతో బీసీలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులుకు గురిచేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చట్టపరంగా కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోతుందన్నారు చంద్రబాబు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ఐదేళ్లలో ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, టీడీపీ హయాంలో సాగునీటికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. జగన్‌ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తమ పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలిజీని తప్పుడు వార్తలకు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారని, కూలీ పనుల కోసం సీమ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దన్నారు చంద్రబాబు.
జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు చంద్రబాబు అని విమర్శించారు. ప్రతి రోజు బటన్ నొక్కా.. బటన్ నొక్కా అని జగన్ చెబుతున్నారు. బటన్ నొక్కింది ఎంత.. ప్రజాధనం బొక్కింది ఎంత? సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ అరాచకాలపై ప్రజలంతా చర్చించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. రాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెస్తామన్నారు.












Click it and Unblock the Notifications