"వారధి".. పవన్ మాత్రమేనా, మోడీని కూడా ఫిక్స్ చేసిన చంద్రబాబు!!
ఏపీ సీఎం చంద్రబాబు బాటలో ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా నడుస్తుంది. సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు డ్యూటీలు వేసి పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇక చంద్రబాబు బాటలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులకు షిఫ్ట్ లు వేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ వంతు వచ్చింది.
బీజేపీ వారధి కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి నెల రెండురోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పైన వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం " వారధి " కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ షెడ్యూల్ ప్రకటించారు.

బీజేపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండే నేతల షెడ్యూల్
వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం అందుబాటులో ఉండే బీజేపీ ప్రజాప్రతినిధుల షెడ్యూల్ ఇలా ఉంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రతి నెలలో మొదటి సోమవారం, మూడవ సోమవారం అందుబాటులో ఉంటారు. శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి నెలలో నాలుగవ సోమవారం,నాలుగవ మంగళవారం అందుబాటులో ఉంటారు . మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రతి నెలలో మొదటి మంగళవారం ,మూడవ మంగళవారం అందుబాటులో ఉంటారు.
ఫిక్స్ డ్ షెడ్యూల్ వేసిన బీజేపీ
శాసన సభ్యులు సుజనా చౌదరి ప్రతి నెలలో మొదటి బుధవారం ,రెండవ బుధవారం అందుబాటులో ఉంటారు. శాసన సభ్యులు ఈశ్వర రావు ప్రతి నెలలో మూడవ బుధవారం,మూడవ గురువారం అందుబాటులో ఉంటారు. శాసన సభ్యులు కామినేని శ్రీనివాసరావు ప్రతి నెలలో మొదటి గురువారం,రెండోవ గురువారం అందుబాటులో ఉంటారు. శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు ప్రతి నెలలో నాలుగవ బుధవారం,నాలుగవ గురువారం అందుబాటులో ఉంటారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు పార్టీ ఆఫీస్ లో డ్యూటీ
శాసన సభ్యులు ఆది నారాయణ రెడ్డి ప్రతి నెలలో మూడవ శుక్రవారం,మూడవ శనివారం అందుబాటులో ఉంటారు. శాసన సభ్యులు పార్థసారధి ప్రతి నెలలో నాలుగవ శుక్రవారం,నాలుగవ శనివారం అందుబాటులో ఉంటారు ఎంపీ సీఎం రమేష్ ప్రతి నెలలో మొదటి శుక్రవారం,రెండవ శుక్రవారం అందుబాటులో ఉంటారు .కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రతి నెలలో మొదటి శనివారం,రెండవ శనివారం అందుబాటులో ఉంటారు .
మోడీ చెప్పిన మార్గంలో ప్రజల కోసం వారధి
జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రతి నెలలో రెండవ సోమవారం,రెండవ మంగళవారం అందుబాటులో ఉంటారు.ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్పే విధంగా జనతా జనార్దన్ అంటే ప్రజలే దేవుళ్లు అనే మాటను నిజం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా వారధి నిర్వహిస్తామన్నారు లంకా దినకర్. కేంద్ర మరియు రాష్ట్ర ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ పథకాలను, ప్రజల కోసం చేసే మంచి కార్యక్రమాలను విజయవంతంగా ప్రజలకు చేరువ చేసే కార్యక్రమమే " వారధి ". అని ఆయన తెలిపారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications