పవన్ తో పొత్తు వేళ జూ ఎన్టీఆర్ ను ఫిక్స్ చేసిన చంద్రబాబు..!!
తెలుగుదేశంకు ఎన్నికల వేళ ప్రతీ నిర్ణయం కీలకంగా మారుతోంది. ఈ నెలలో మహానాడు ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. అధికారికంగా పొత్తుల ప్రకటకు రంగం సిద్దం చేస్తున్నారు. పార్టీలో కీలక చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో నందమూరి కుటుంబం పాత్ర కీలకం కానుంది. అందులో భాగంగా ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూ ఎన్టీఆర్ ను ఆహ్వనించారు. గత విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
చంద్రబాబు వ్యూహం:ఈ సారి ఎన్నికలు టీడీపీ..వ్యక్తిగతంగా చంద్రబాబు కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జనసేన నుంచి పొత్తు దిశగా గ్రీన్ సిగ్నల్ సాధించారు. బీజేపీతో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక కీలకంగా నందమూరి కుటుంబం మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా నందమూరి కుటుంబం రాజకీయంగా ఈ సారి యాక్టివ్ గా కనిపిస్తోంది. చంద్రబాబుకు మద్దతుగా పలు సందర్భాల్లో బయటకు వచ్చారు. చంద్రబాబు తాజాగా గుడివాడలో పర్యటన సమయంలో నందమూరి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే రోడ్ షో లో నందమూరి రామక్రిష్ణను ఉంచటం ద్వారా నందమూరి కుటుంబం అక్కడి నుంచి బరిలో నిలుస్తందనే పక్కా సంకేతాలు ఇచ్చారు.

జూ ఎన్టీఆర్ కు ఆహ్వానం:ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్ లోజరిగే కార్యక్రమంలో పాల్గొనాలని నందమూరి ఫ్యామిలీతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్, 'జయహో ఎన్టీఆర్' వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శతజయంతి కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడకలకు రజనీకాంత్ ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను పిలవకపోవటం పైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో పొత్తు వేళ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జూ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.
తారక్ ఏం చేయబోతున్నారు:దీని ద్వారా వచ్చే ఎన్నికల ముందు జూ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వ్యతిరేకత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ నెల 20న జూ ఎన్టీఆర్ జన్మదినం. అదే రోజు హైదరాబాద్ లో కార్యకమం నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ అదే రోజున అభిమానుల మధ్యకు రానుంది. జూ ఎన్టీఆర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం ఉంది. ఈ సమయం లో జూ ఎన్టీఆర్ ను ఆహ్వానించటం ద్వారా ఒక విధంగా తారక్ ను ఇరకాటంలోకి నెట్టారనే వాదన ఉంది. తనకు అవకాశం ఉన్నంత వరకు హాజరవుతానని జూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాత శత జయంతి కార్యక్రమం..అటు ముందుగానే ఫిక్స్ అయిన షెడ్యూల్..దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారాన్ని తారక్ ఎలా చేధిస్తారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications