• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఆఖరుసారి,జగన్ మూడో సారి,పవన్ రెండోసారి.!రంజుగా ఏపీ రాజకీయం.!పైచేయి ఎవరిది?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: దేశంలో రాజకీయం ఎక్కడ ఆసక్తిగా సాగినా సాగకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రంజుగా కొనసాగుతుంది. ఎన్నికల సీజన్ తో సంబంధం లేకుండా రాజకీయం ఎప్పుడూ వాడి వేడిగా కొనసాగుతుంది. అంతే కాకుండా నేతల మద్య మాటలు కూడా తూటాల్లా పేలిది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే అంటే ఆశ్చర్యం వేయక మానాదు. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలోనే కాకుండా, శాసనసభ సమావేశాలప్పుడు, అధికార, ప్రతిపక్ష పార్టీల బహిరంగ సభల నేపధ్యంలో చెలరేగే వివాదాలకు ఆకాశమే హద్దుగా మారుతుంది. తాజాగా ప్రతిపక్షనేత చంద్రాబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది.

 కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలు.. సంచలనం చేసిన వైసిపి నేతలు

కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలు.. సంచలనం చేసిన వైసిపి నేతలు


కర్నూల్ జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. కాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనమా కాదా అనే అంశాన్ని మాత్రం వైసిపీ నాయకులు చంద్రబాబు ముమ్మాటికీ సంచలన వ్యాఖ్యలే చేసారని నిరూపించారు. చంద్రబాబు వ్యాఖ్యలు సాదాసీదాగా ఉన్నప్పటికీ ఆ వ్యాఖ్యలను వైసీపి ముఖ్య నేతలు సంచలనంగా మార్చడంలో సఫలం అయ్యారనే చర్చ జరుగుతోంది.అందుకే ఏపి రాజకీయాల్లో ఏ నాయకుడు ఏది మాట్లాడినా అది తారా స్ధాయిలో ప్రాచూర్యంపొందుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 చివరి ఎన్నికలు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చివరి ఎన్నికలు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


ఇక ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు పోటీ పడి మరీ స్పందిస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి సిదిరి అప్పలరాజు, జోగి రమేష్, మరోమంత్రి అమర్నాద్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడుతున్నారు. సజ్జల మరో అడుగు ముందుకేసి చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే రాజకీయాన్ని వదిలేసారని, అందుకే ఆ పార్టీ నామమాత్రపు సీట్లను కూడా గెలుచుకోలేక పోయిందని ఎద్దేవా చేసారు. మిగతా నేతలు కూడా పదునైన పదజాలంతో చురుకైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు సమయం మించిపోయిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు.

 బాబు వ్యాఖ్యలకు ప్రాముఖ్యత.. చురుగ్గా స్పందించిన వైసీపి

బాబు వ్యాఖ్యలకు ప్రాముఖ్యత.. చురుగ్గా స్పందించిన వైసీపి

ఇదంతా ఒక ఎత్తైతే చంద్రబాబు నాయుడుకు చివరి ఎన్నికలైనప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారా అన్నది కూడా మిలయన్ డాలర్ల ప్రశ్నే. కాగా చివిరి ఎన్నిక కాబట్టి ఓ సంతృపక్తికర వీడ్కోలు పలకాలన్న భావన ఏపీ ప్రజల్లో చోటుచేసుకుంటే మాత్రం చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ఆశించిన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ది సంక్షేమ పథకాల ఉప్పెన ముందు, పవన్ కళ్యాణ్ దూకుడు సునామీ ముందు చంద్రబాబుకు మరోసారి సారీ చివరిసారి పరాభవం తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

 పవన్ ప్రభావం.. వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చంటున్న ప్రజలు..

పవన్ ప్రభావం.. వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చంటున్న ప్రజలు..

ఇక మొదటి సారి ప్రతిపక్షంలో, రెండో సారి అధికారంలో ఉన్న వైయ్యస్సార్ సీపీ మూడోసారి తన అదృష్టాన్ని చేజారిపోకుండా జాగ్రత్త పడేందుకు వ్యూహాలు రచిస్తోంది. చంద్రబాబును ఎదుర్కోవడంలో ధీటైన ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది వైసీపి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండో సారి తన పాచిక ఎందుకు పారదనే కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపితో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఏపీలో ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఏపి ప్రజలు పవన్ కళ్యాణ్ కూడా మద్దత్తు ప్రకటిస్తుండంతో ఏపిలో చివరిసారి, మూడోసారీ, రెండోసారి రాజకీయం రంజుగా సాగుతోంది.

English summary
No matter where the politics in the country is interesting, it will continue to rage in Andhra Pradesh. Irrespective of the election season, politics always continues to heat up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X