మదనపల్లెలో ఏం జరిగిందో మర్యాదగా చెప్పండి, ప్రత్యేక కమిటీ వేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి (ఉమ్మడి చిత్తూరు జిల్లా) సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై కూటమి ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం.

మదనపల్లె సబ్ కలెక్టర్ గా నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు సైతం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై చాలా సీరియస్ అయ్యారు. అసలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిజంగా అగ్నిప్రమాదం జరిగిందా, కుట్ర పూరితంగా కావాలనే కార్యాలయానికి నిప్పంటించారా అనే అంశంలో విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Chandrababu formed a special committee to investigate the Madanapalle sub collector s office fire

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వ భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు అంటే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి పత్రాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి సుమారు 11.24 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆఫీసులోని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కంప్యూటర్లు, పలు కీలకమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన తరువాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

Chandrababu formed a special committee to investigate the Madanapalle sub collector s office fire
పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి సొంతఊరు ఉద్యోగి, అంతరాత్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో ?

అయితే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచానా వేస్తున్నారు అయితే కావాలనే సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 25కు పైగా కీలక రన్నింగ్స్ ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదాన్ని చంద్రబు నాయుడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఈ అగ్నిప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలు కూడా కాలి బూడిద అయ్యాయని వెలుగు చూసింది సీసీ కెమెరాలకు ఏర్పాటు చేసిస సీడీఆఱ్ ను పోలీసులు స్వాదీనం చసుకుని నిపుణులతో దానిని పరిశీలిస్తున్నారని తెలిసింది తిరుపతి, చిత్తూరు నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ అధికారులు అగ్నిప్రమాదం ఎలా జరిగింది అని ఆరా తీస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+