జగనన్న విద్యా కానుక కిట్లు ఇవ్వట్లేదా ? కూటమి సర్కార్ క్లారిటీ ఇదే..!
ఏపీలో పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్ధులకు విద్యా కానుక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన జగనన్న విద్యా కానుక కిట్లనే ఈసారికి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్షేత్రస్దాయిలో అలా జరగడం లేదని, ఇదంతా టీడీపీ ప్రచారమేనని వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. జగన్ పేరు లేకుండా ఉన్న సాధారణ కిట్లనే విద్యార్ధులకు ఇస్తున్నారనేది వీటి సారాంశం. దీనిపై ప్రభుత్వం స్పందించింది.
ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ (ap govt fact check)లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ వైసీపీ చేస్తున్న ప్రచారంపై స్పందించింది. 2024-25 విద్యా సంవత్సరం కోసం ఆర్డర్ చేసిన కిట్లపై ఎలాంటి పేర్లు లేకుండా తాము ముద్రణకు, తయారీకి ఇచ్చినట్లు వైసీపీ అనుకూల హ్యాండిల్స్ లో జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. పాత స్టాక్ ఉంటే విద్యార్ధులకు ఇవ్వొద్దని డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారంటూ పెడుతున్న పోస్టులపైనా క్లారిటీ ఇచ్చింది.

"సీఎం చంద్రబాబునాయుడు గారి ఆదేశానుసారం, "జగనన్న విద్యాకానుక" అని ముద్రించబడిన బ్యాగులు, బెల్టులు కూడా విద్యార్థులకు పంపిణీ చేయబడుతున్నాయి. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేస్తున్న అవాస్తవాలను నమ్మవద్దు." అంటూ ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం సమయాభావం, డబ్బుల వృథా వంటి కారణాలతో ఈసారికి జగనన్న విద్యా కిట్లను విద్యార్ధులకు ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వీటినే విద్యార్ధులకు పంపిణీ చేస్తున్నారు.
సీఎం చంద్రబాబునాయుడు గారి ఆదేశానుసారం, "జగనన్న విద్యాకానుక" అని ముద్రించబడిన బ్యాగులు, బెల్టులు కూడా విద్యార్థులకు పంపిణీ చేయబడుతున్నాయి. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేస్తున్న అవాస్తవాలను నమ్మవద్దు. #AndhraPradesh pic.twitter.com/6AHsfygbFU
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) June 14, 2024












Click it and Unblock the Notifications