మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా కొత్త మద్యం షాప్ ల లాటరీ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు 89,882 మంది దరఖాస్తు చేసుకోగా, డ్రా తీసి షాపులు కేటాయించారు. ప్రస్తుతానికి షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కూడా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి.
లిక్కర్ పై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్
ఈ క్రమంలో గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ బ్రాండ్లను మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవోను జారీ చేసింది. లిక్కర్ పై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపైన సెస్ విధించేలాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సెస్ ద్వారా వచ్చిన నిధులు అందుకే
ఈ సెస్ ద్వారా సుమారు 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సెస్ ద్వారా సమీకరించిన నిధులను డ్రగ్స్ నియంత్రణకు, రిహాబిలిటేషన్ సెంటర్లకు ప్రభుత్వం వినియోగించే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే నిన్న లాటరీ విధానం ద్వారా మద్యం షాపులను ప్రభుత్వం కేటాయించింది. రేపటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
అదనపు ప్రివిలేజ్ ఫీజు క్రింద మరో నిర్ణయం
తాజాగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అదనపు ప్రివిలేజ్ ఫీజ్ క్రింద చిల్లర కాకుండా తదుపరి 10రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే మద్యం బాటిల్ ఎంఆర్పి ధర 150.50పైసలు గనుక ఉంటే దానిని 160 రూపాయలకు పెంచేలా అదనంగా ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది. అంతేకాదు విదేశీ మద్యం బాటిల్స్ పైన కూడా అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎంఆర్పి ధరలో చిల్లర కాకుండా తదుపరి 10రూపాయలకు పెంచింది ఏపీ ప్రభుత్వం.
మద్యం షాపులలో డిజిటల్ పేమెంట్ విధానం
ఇక గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్ లకు గండిపడగా, కూటమి ప్రభుత్వం మళ్లీ డిజిటల్ పేమెంట్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి డిజిటల్ పేమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్ధతిని మద్యం అమ్మకాలలో అవలంబించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. అక్టోబర్ 16వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలులోకి రానున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల ద్వారా లిక్కర్ బిజినెస్ జరగబోతుంది.












Click it and Unblock the Notifications