ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు లైన్ క్లియర్-ఆర్డినెన్స్ జారీ..!

ఏపీలో దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు అందకుండా దూరంగా ఉండిపోతున్న ఎస్సీలకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణపై ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ జీవో జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై బిల్లు పెట్టి ఆమోదించబోతోంది.

ఎస్సీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నప్పటికీ అందులో కొన్ని వర్గాలకే వీటి ఫలాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి విరుగుడుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్ తో మందకృష్ణ మాదిగ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. దీంతో గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే ఎస్సీ వర్గీకరణకు పావులు కదిపారు. దశాబ్దాల పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే విధంగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

Chandrababu government issued ordinance for sc sub-classification as per sc verdict

దీని అమలు కోసం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదించారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దీన్ని అమలు చేయకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వొద్దంటూ గతంలో మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కోరారు.

Chandrababu government issued ordinance for sc sub-classification as per sc verdict

దీంతో రాష్ట్రంలో డీఎస్సీ సహా పలు ఉద్యోగ ప్రకటనలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో వరుసగా ఉద్యోగ ప్రకటనలు కూడా రాబోతున్నాయి. ఇందులో ముందుగా మెగా డీఎస్సీ ప్రకటన ఐదు రోజుల్లో వస్తుందని మంత్రి నారా లోకేష్ నిన్న ప్రకటించారు. ఇదే క్రమంలో మిగతా ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+