నూజివీడు మామిడి ఇమేజ్ పెంచేలా.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. గతంలో లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతుల సమస్యలు విని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

30 కోట్లతో నూజివీడు మార్కెట్ యార్డ్ అభివృద్ధి
ఈ క్రమంలో మామిడి రైతుల సౌకర్యార్థం నూజివీడు మార్కెట్ యార్డ్ లో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు 30 కోట్ల రూపాయలను మంజూరు చేసామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. నూజివీడు మామిడికి మరింత ఇమేజ్ చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నూజివీడు మార్కెట్ యార్డును 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

chandrababu govt sensational decisions to increase the image of nuziveedu mangoes

నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు
నేడు నూజివీడు మార్కెట్ యార్డ్ లో సౌకర్యాల ఏర్పాటు పైన రైతులు, వ్యాపారస్తులు, అధికారులతో సమీక్షించిన మంత్రి నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. ఇటీవల కాలంలో నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా ఎంతగానో నష్టపోతున్నారని, అయితే రైతులకు భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని అన్నారు.

నూజివీడు మామిడి విదేశాలకు ఎగుమతి చేసేలా ఎయిర్ కార్గో సేవలు
రైతాంగ సంక్షేమానికి సబ్సిడీతో కూడిన పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. నూజివీడు మామిడి ఇమేజ్ ను మరింత పెంచడం కోసం నాణ్యమైన మామిడి పంట కోసం రైతులు కృషి చేయాలన్నారు. నూజివీడు మామిడి కి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూజివీడు నాణ్యమైన మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఎయిర్ కార్గో సేవలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.

నూజివీడు మామిడికి బంగారు భవిష్యత్ అందిస్తాం
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, ఫుడ్ పార్క్ ను నూజివీడు ప్రాంతంలో ఏర్పాటు చేసి నూజివీడుకు బంగారు భవిష్యత్తును అందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతని ఇస్తున్నారు అని తెలిపారు . గత ప్రభుత్వం విస్మరించిన మామిడి పంటకు బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.

నూజివీడు మామిడి రైతులకుఅండగా ప్రభుత్వం
మామిడి పరిశోధనా సంస్థ శాస్త్రజ్ఞులు రైతులకు ఉపయోగపడేలా మరిన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉందని, క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యమైన మామిడి ఉత్పత్తి కోసం తీసుకోవలసిన చర్యలను సూచించాలని పేర్కొన్నారు. నూజివీడు మామిడి రైతులకు ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తుందని, వారికి కావలసిన సకల సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+