చిరు కాంట్రాక్టర్లకు చంద్రబాబు దసరా కానుక..!
ఏపీలో కూటమి సర్కార్ దసరా సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాధితుల్లో ఒకరైన కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో వైసీపీ హయాంలో చేసిన పనులకు గానూ వారికి ఇప్పటివరకూ చెల్లించని బకాయిలను క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ పరిమితి కూడా విధించింది. దీని మేరకు ఈ దసరాకు వారికి చెల్లింపులు చేయబోతున్నారు. దీంతో ఆయా కాంట్రాక్టర్ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో చిరు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దసరా సందర్భంగా శుభవార్త చెప్పింది. రూ.5 లక్షల మేర బిల్లుల చెల్లింపునకు ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య అంటే వైసీపీ హయాంలో చేపట్టిన పనులతో పాటు అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు గానూ పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ చెల్లించేయాలని నిర్ణయించింది. దీంతో ఆయా కాంట్రాక్టర్లకు దాదాపు 400 కోట్ల మేర లబ్ది కలగబోతోంది.

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతకు ముందు టీడీపీ హయాంలో చేసిన పనులకు గానూ బిల్లుల్ని చెల్లించలేదు. దీనిపై కాంట్రాక్టర్లు పలుమార్లు ఆందోళనలు చేశారు. కోర్టుల్ని కూడా ఆశ్రయించారు. అయినా ప్రభుత్వం చలించలేదు. వారికి ఇవ్వాల్సిన బిల్లులు క్లియర్ చేయకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది. దీనిపై హైకోర్టు పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి అధికారుల్ని కోర్టుకు రప్పించిన తర్వాత వీటి క్లియరెన్స్ ప్రారంభించారు.
అలాగే వైసీపీ హయాంలో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆయా కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు 5 లక్షల లోపు ఉంటే చెల్లించేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అంటే గత 10 ఏళ్లలో చేసిన పనుల బకాయిలు రూ.400 కోట్ల మేర చెల్లించబోతున్నారు. దీంతో పండుగ వేళ ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications