ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..!

ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు (Chandrababu)సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచీ బకాయిపడ్డ భారీ మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ మొత్తాలు త్వరలోనే అందబోతున్నాయి. దీంతో ఎప్పటి నుంచో వీటి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గత కొన్నేళ్లుగా డీఏతో పాటు ఇతర బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ప్రభుత్వాలకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్థికశాఖ వీటిపై కసరత్తు చేసింది. వీళ్లకు బకాయిలు ఉన్న భారీ మొత్తంలో ప్రస్తుతానికి రూ.7059 కోట్ల మేర విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Chandrababu Govt to Release 7 500 Cr in Dues to Employees and Pensioners

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+