టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..!
తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల (tdp mla) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన చదలవాడ అరవిందబాబు. నిన్న తన అనుచరుడిని సలహాదారుగా నియమించుకోవాలంటూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుపై ఆయన ఆఫీసుకు వెళ్లి ఎమ్మెల్యే చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) దీనిపై సీరియస్ అయ్యారు. పల్నాడు ఎస్పీ ఆఫీసుపై ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఎస్పీ ఆఫీసులో దాదాపు 9 గంటల పాటు రచ్చ చేసిన అరవిందబాబును బుజ్జగించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు ఫోన్లు చేసినా ఆయన స్పందించలేదు. కానీ ఇవాళ అరవిందబాబు స్వయంగా పల్లాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పల్లా... తమ వద్దకు వచ్చి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించారు.

నిన్న తన అనుచరుడు గోపీకృష్ణకు ఎస్పీ సలహాదారుగా కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఆయన ఆఫీసుకు వెళ్లిన అరవిందబాబు రచ్చరచ్చ చేశారు. ఉన్నతాధికారులకు ఈ మేరకు ఎస్పీ సిఫార్సు చేసినా ఊరుకోలేదు. ఎస్పీ బాత్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో పాటు దీనిపై ఉత్తర్వులు వచ్చే వరకూ వెళ్లబోనని భీష్మించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా వినకుండా బీభత్సం సృష్టించారు. ఇవాళ చంద్రబాబు బహిరంగంగానే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు నియంత్రణలో ఉండేందుకు యోగా క్లాసులకు వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications