AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీని వైద్యారోగ్య రంగంలో మేటిగా నిలిపేందుకు వీలుగా ప్రభుత్వం (ap govt) ఇవాళ కీలక నిర్ణయాలు తీసుుకుంది. ఈ మేరరకు సంజీవని ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అలాగే ప్రతీ నెల 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' పేరుతో గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో సక్సెస్ అయిన సంజీవని ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్రమంతటా అమలుకు ఆదేశించారు.
వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లు, రూ.162 కోట్లు వ్యయం చేసేందుకు సీఎం అంగీకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేసుకున్నారని, వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా చూడాలని, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని... ఈ 5 పిల్లర్లతో త్వరలో 'ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ' తీసుకురావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపైనా సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు ఇన్సూరెన్స్ సంస్థలు ముందుకొస్తున్నట్టు అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చర్చించారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని, రేషనలైజేషన్ ద్వారా ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. వైద్యుల సూచన మేరకు మాత్రమే గర్భిణులకు ఇకపై సిజేరియన్లు చేయాలని, మిగిలిన సమయంలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 20 శాతానికి మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications