పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా రైల్వే ఈ మధ్య కాలంలో కొత్త మార్పులు తీసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే సదుపాయాల కల్పన విషయంలో ప్రాధాన్యత పెరిగింది. కొత్తగా వందేభారత్ రైళ్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతోంది. రైల్వే శాఖ కొత్తగా ప్రారంభించిన వందేభారత్ స్లీపర్ త్వరలోనే ఒకటి మనకు కేటాయించనున్నారు. కాగా, ఇదే సమయంలో పల్నాడు, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణీకులకు తాజాగా రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక మార్పులు తీసుకొచ్చింది.
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. నిత్యం రద్దీగా నడిచే పల్నాడు, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో తాజాగా మరో సదుపాయం కల్పించింది. గుంటూరు- వికారాబాద్ మధ్య నడిచే పల్నాడు ఎక్స్‌ప్రెస్ తో సహా గుంటూరు- విశాఖ మధ్య నడుస్తున్న సింహాద్రి ఎక్స్‌ప్రెస్ లో ఇప్పటి వరకు ఏసీ ఛైర్ కార్, సెకండ్ సిట్టింగ్ సదుపాయం మాత్రమే ఉంది. నిత్యం ఈ రెండు రైళ్లల్లో అటు సికింద్రాబాద్, ఇటు విశాఖ వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తారు.

ఈ రైళ్లు ప్రారంభం నుంచి ఆక్యుపెన్సీ రేషియా ఎక్కడా తగ్గలేదు. ఈ రెండు రైళ్ల హాల్టింగ్ స్టేషన్లు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండటంతో వీటిల్లో ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, ఈ రెండు రైళ్ల కు వస్తున్న ఆదరణ.. ప్రయాణీకుల డిమాండ్ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కొత్త నిర్ణయం వచ్చే వారం నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే శాఖ తాజా నిర్ణయంతో
ఇప్పటి వరకు ఈ రెండు రైళ్లల్లో ఛైర్ కార్, సెకండ్ సీటింగ్ మాత్రమే అందుబాటులో ఉండటంతో సీనియర్ సిటిజెన్స్, మహిళలు కూర్చొని ప్రయాణం చేయాల్సి రావటం ఇబ్బంది కరంగా మారుతోంది. దీంతో.. ఈ రెండు రైళ్లల్లో కొత్తగా త్రీటైర్ ఏసీ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తూ తాజాగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్ లో, అదే విధంగా 24, 25 తేదీల నుంచి సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కి 3 ఏసీ బోగీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభిస్తున్నారు.
దీని ద్వారా ఈ రెండు రైళ్లల్లో ఇక సీనియర్ సిటిజెన్స్ ప్రయాణం లో వెసులు బాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రైళ్లకు ప్రస్తుతం ఒక త్రీ టైర్ ఏసీ కోచ్ ఏర్పాటు చేస్తున్నఅధికారులు... ప్రయాణీకుల నుంచి వచ్చే డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని పెంపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications