కేబినెట్‌పై బాబు కసరత్తు: ఈ జిల్లాల్లో వీరికే, వారికి నో!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ కూర్పు పైన కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయమై ఆయన దాదాపు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వాటిని కుదించేందుకు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.
సామాజిక వర్గాలను, ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఆయన కేబినెట్ కూర్పు చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం బాబుతో పాటు ఏడెనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. కొత్త రాష్ట్రం నేపథ్యంలో ఎపి అభివృద్ధి, రాజధాని నిర్మాణం దృష్ట్యా సీనియర్లకు అవకాశమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. కొత్తగా వలసలు వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం లేదని సమాచారం. చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసే వారిలో రెడ్డి సామాజిక వర్గం వారు ఉండరని తెలుస్తోంది. తర్వాత విస్తరణలో వారికి అవకాశం దక్కవచ్చు.

జిల్లాల వారీగా చంద్రబాబు పరిశీలిస్తున్న పేర్లు...
శ్రీకాకుళం - గౌతు శివాజీ, లక్ష్మీ దేవి
విజయనగరం - పతివాడ నారాయణ స్వామి, కోళ్ల లలిత
విశాఖ - అయ్యన్నపాత్రుడు, బండారు
తూర్పు గోదావరి - యనమల రామకృష్ణుడు, చినరాజప్ప
పశ్చిమ గోదావరి - ముడియం శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత
కృష్ణా - దేవినేని ఉమామహేశ్వర రావు
గుంటూరు - పుల్లారావు, కోడెల శివప్రసాద రావు
ప్రకాశం - శిద్ధా రాఘవరావు
చిత్తూరు - బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, శంకర యాదవ్
అనంతపురం - పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు
కర్నూలు - కెఈ కృష్ణమూర్తి
సామాజిక వర్గాల వారిగా...
శిద్ధా రాఘవ రావు (వైశ్య), ముడియం (ఎస్టీ), పీతల సుజాత (ఎస్సీ), గౌతు శివాజీ, కెఈ కృష్ణమూర్తి (గౌడ), అయ్యన్నపాత్రుడు, బండారు, కోళ్ల లలిత, లక్ష్మీదేవి (వెలమ), చినరాజప్ప, పతివాడ (కాపు), యనమల రామకృష్ణుడు (యాదవ), కోడెల శివప్రసాద రావు, పుల్లారావు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వర రావు (కమ్మ)లు ఉన్నారు.












Click it and Unblock the Notifications