ఎమ్మెల్సీ ఎన్నికల ప్లాన్ ఇదే-కూటమి పార్టీలకు చంద్రబాబు దిశానిర్దేశం..!
ఏపీలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ రెండు సీట్లను ఎలాగైనా గెలిచేందుకు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ కూటమి పార్టీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఎలా గెలవాలో మూడు పార్టీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను నాలుగు జిల్లాల టీడీపీ నేతలతో మాట్లాడే నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇవాళ అదే నాలుగు జిల్లాల నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కూటమి పార్టీల నేతలంతా సమష్టిగా పనిచేస్తే రెండు ఎమ్మెల్సీ సీట్లు సునాయాసంగా గెల్చుకుంటామని చంద్రబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం కూటమి పార్టీలు సమష్టిగా పనిచేస్తే 93 శాతం సీట్లు గెల్చుకున్న విషయాన్ని వారికి గుర్తుచేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుకు నవంబర్ 6 తుది గడువు కాబట్టి ఆలోపు సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే కూటమి పార్టీల నేతలతో నాలుగు జిల్లాల్లోనూ భేటీలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందన్నారు. ప్రతీ పట్టభద్రుడనీ ఓటరుగా చేర్పించాలని, వారి కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాల కల్పనను వారికి అర్దమయ్యేలా వివరించాలన్నారు.












Click it and Unblock the Notifications