బాలయ్య చిన్న అల్లుడికి చంద్రబాబు టార్గెట్?
బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖపట్నం లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జిగా ఉన్న శ్రీ భరత్ కు ఇప్పుడు చంద్రబాబు కీలక టార్గెట్ అప్పగించారు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక తెలుగుదేశం, వైసీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఛాలెంజ్ గా తీసుకున్న చంద్రబాబు చివరి నిముషంలో అభ్యర్థిని మార్చేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు టికెట్ కేటాయించడంతోపాటు గెలవాలనే టార్గెట్ ను కూడా విధించారు. వేపాడ ఇటీవలే గంటా శ్రీనివాసరావును కలిసి విజయం కోసం కలిసిరావాలని కోరారు.
తాజాగా బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖపట్నం లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జిగా ఉన్న శ్రీ భరత్ కు ఇప్పుడు చంద్రబాబు కీలక టార్గెట్ అప్పగించారు. పట్టభద్రుల స్థానాన్ని టీడీపీ దక్కించుకోవాలని, దీన్ని టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పునాదులు వేసుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. డాక్టర్ వేపాడను గెలిపించి పార్టీకి బహుమతిగా ఇవ్వాలని శ్రీ భరత్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇక్కడే హోరాహోరీ పోరు నడుస్తోంది.

వైసీపీ తరఫున నిలబడ్డ సీతంరాజు సుధాకర్ కూడా విజయం కోసం బలంగా పోరాడుతున్నారు. ఈ ఎన్నికలో దాదాపు 40 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా ఉన్నారు. ఇక్కడ టీడీపీని గెలిపించే బాధ్యతను భరత్ పై పెట్టడంతో క్షేత్రస్థాయిలో నాయకులను కదిలించేందుకు ప్రయత్నం సాగింది. గండి బాబ్జీతోపాటు ిఇతర నాయకులను కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటేనే యువతకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, నిరుద్యోగం, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని ఇవ్వకపోవడంవంటి అనేక విషయాలను ప్రస్తావించాలని నిర్ణయించయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు టార్గెట్ పెట్టినట్లుగా ఈ స్థానాన్ని భరత్ గెలిపించగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపొందడం సులువవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications