వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యపరుస్తున్న చంద్రబాబు: ఆరోగ్య రహస్యాలివే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండ్రోజుల క్రితమే తన 67వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే, ఆయన 67వ పడిలోకి అడుగుపెట్టినప్పటికీ 20ఏళ్ల యువకుడిలానే అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

చంద్రబాబునాయుడు తన 28 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే, 30 ఏళ్ళ వయసులో మంత్రి, 46 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేగాక, యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్, ప్రధాని అయ్యేందుకు అవకాశాలు కూడా వచ్చాయి ఆయనకు. రాజకీయ రంగానికి ప్రొఫెషనలిజమ్ ఆపాదించిన మొదటి రాజకీయ నాయకుడిగా చంద్రబాబు పేరుతెచ్చుకున్నారు.

కాగా, చంద్రబాబునాయుడు 67 ఏళ్ళ వ‌య‌సులో కూడా రోజుకి 18 గంట‌లు పని చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంట‌ల‌కే నిద్రలేచే చంద్రబాబు యోగాతో తన దినచర్యను ప్రారంభిస్తారు. దినచర్య రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. ఓ వైపు జిల్లాల పర్యటనలు చేస్తూనే.. మరోవైపు విజ‌య‌వాడ‌లోని క్యాంపు ఆఫీస్‌లో సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం ఇస్తుంటారు.

67ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు చాలా ఉత్సాహంగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే మితాహారమే. ఉదయం ప్లేటు ఇడ్లీ, మధ్యాహ్నం రెండు పుల్కాలు, పండ్లు, ఒక కోడిగుడ్డు, రాత్రిపూట చపాతి, పండ్లతో భోజనాన్ని ముగిస్తారు.

 Chandrababu health secrets

చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో నారా ఖ‌ర్జూరనాయుడు, అమ్మణమ్మల దంపతులకు జన్మించిన చంద్రబాబు.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రయ్యారు.

ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు అనేక సవాళ్లు, ప్రతిసవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా వాటన్నింటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ఏకంగా 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టాంచారు.

ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తుంది. ఈ రెండేళ్ళ కాలంలో కూడా సీఎంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా చంద్రబాబు ముందు అనేక స‌వాళ్లు మిగిలే ఉన్నాయి.

ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం... కేంద్రం నుంచి ప్ర‌త్యేక‌హోదా, నిధులు రాబ‌ట్ట‌డంతో పాటు త‌న రాజ‌కీయ వార‌సుడిని తీర్చిదిద్ద‌డం.. ఆయ‌న ముందున్న స‌వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అయినా, ఉత్సాహంగా ముందుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబునాయుడు.

English summary
Notwithstanding the opposition ridicule, chief minister N Chandrababu Naidu claims he works for 18 hours a day.The question flashes across one’s mind is that what is the secret of his health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X