చంద్రబాబు నోట ఆకస్మిక తనిఖీల మాట..టార్గెట్ అదేనట..!
ఏపీలో ఆకస్మిక తనిఖీలకు పెట్టింది పేరైన సీఎం చంద్రబాబు మరోసారి దుమ్ముదులిపేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా పెనమలూరులోని రైతు సేవా కేంద్రానికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయో లేవో తెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను సకాలంలో చేయడంతో వారికి పక్కాగా డబ్బులు అందేలా చూస్తామన్నారు. అనంతరం అధికారులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
చిన్న చిన్న పొరబాట్లు కూడా సవరించి లోపాల్లేని వ్యవస్థను రూపొందించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు అధికారులకు తెలిపారు. ఇవాళ చెప్పి వచ్చానని, త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం అధికారులకు వెల్లడించారు. భవిష్యత్తులో ధాన్యం సేకరణ ఎక్కడ జరుగుతుందో చూసి అక్కడికి వెళ్లిపోతానన్నారు. తప్పు జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. పని చేయకపోతే కష్టమని అధికారులనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా అధికారుల్లో జవాబుదారీ తనం తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని, అందుకే తాను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు చంద్రబాబు అధికారులకు తేల్చిచెప్పేశారు. పెనమలూరు రైతు భరోసా కేంద్రంలో తాను చూసిన పరిస్ధితులపై అధికారులకు చంద్రబాబు వివరించారు. ధాన్యం సేకరణ విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు.












Click it and Unblock the Notifications