అనపర్తిలో కూటమి అభ్యర్ధి మార్పు ? చంద్రబాబు సంకేతం...!
ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత అనపర్తిలో అభ్యర్ధిగా ప్రకటించిన శివరామకృష్ణంరాజుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసలే బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు అంతంత మాత్రంగా ఉన్న పరిస్ధితుల్లో స్ధానికంగా బలంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మద్దతు ఆయనకు లభించడం కష్టమేనని తేలిపోయింది. అదే సమయంలో టీడీపీ లిస్ట్ లో తన పేరు ప్రకటించి ఆ తర్వాత తనతో చర్చించకుండానే బీజేపీకి ఇచ్చేయడంపై స్ధానిక నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడుతున్నారు..
ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ మొండి పట్టుకు పోయి పోటీ చేస్తే అక్కడ అభ్యర్ధి ఓడిపోవడమే కాకుండా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి ఎంపీ సీటుపైనా ఆ ప్రభావం పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు రేపటి నుంచి జనంలోకి వెళ్లేందుకు నల్లమిల్లి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొవ్వూరులో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదంటు చంద్రబాబు కొవ్వూూరులో వ్యాఖ్యానించారు. దీంతో అనపర్తి సీటు మార్పుకు టీడీపీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి మరో సీటు ఇచ్చి అనపర్తిలో టీడీపీయే పోటీ చేసేలా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సీటు ఇంకా నిర్ణయం కాలేదంటూ చంద్రబాబు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications