ఆయనకు అర్థం కాదు! జగన్‌కు తెలియదు: పవన్ కళ్యాణ్‌కు బాబు ఘాటుగా
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కౌంటర్ ఇచ్చారు. ఇరువురు నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

ప్రాజెక్టుల గురించి నేను తెలుసుకోవాల్సిందే చాలా ఉందని, అలాంటిది మీకు ఏం తెలుసు అన్న విధంగా మాట్లాడారు. అనుభవం లేకుండా, తెలియకుండా మాట్లాడవద్దని హితవు పలికారు. ఇటీవల పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఇంకా శ్వేతపత్రం ఎందుకు
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. అనుభవం లేకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడద్దని పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము వారం వారం ప్రాజెక్టు వివరాలు చెబుతున్నామని, అలాంటప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలని అడగటం ఏమిటని ప్రశ్నించారు.

పవన్‌కు అర్థం కాదు, జగన్‌కు తెలియదు
పవన్ కళ్యాణ్‌కు ఏమీ అర్థం కాదని, జగన్‌కు ఏమీ తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ప్రతిపక్షాలు అవగాహన పెంచుకోవాలన్నారు. జగన్‌కు కాంక్రీట్, పిల్లర్‌ల గురించి తెలుసా అని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాజీపడమని, అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ ప్రాజెక్టుకు 48 గేట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంక్రీట్ పనులు త్వరగా పూర్తి చేస్తే అన్నీ సాధ్యమని చెప్పారు. ప్రతి రైతుకు పోలవరం ఓ కల అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రజలకు సెంటిమెంటుగా మారిందన్నారు. ఏపీకి జీవనాడి అన్నారు.

అందువల్లే బాగా పెరిగింది
పోలవరం పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని చంద్రబాబు చెప్పారు. ఏపీలో కరువుపోతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాము ఇప్పటి వరకు రూ.12,567 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పునరావాస ఖర్చు రూ.32 వేల కోట్లకు చేరిందన్నారు. 2013 భూసేకరణ చట్టం వల్ల ఇది బాగా పెరిగిందని తెలిపారు. తాను పలుమార్లు పోలవరంను స్వయంగా, వర్చువల్ ద్వారా పర్యవేక్షించానని చెప్పారు.

నితిన్ గడ్కరీ హామీ
కాగా, పోలవరం జాతీయ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రభుత్వంతో కలిసే 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 22న పోలవరం సందర్శిస్తానని ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతానని పేర్కొన్నారు. తమ వద్ద ఒక్క బిల్లూ పెండింగ్ ఉండదన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం సందర్శించి ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. అందులో భాగంగానే ఆయన రాష్ట్రానికి రానున్నారు.












Click it and Unblock the Notifications