కెసిఆర్‌కు ఫోన్ చేసి పిలిచిన బాబు, జగన్‌కు ఆహ్వానం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనను అభినందించారు. అనంతరం తన ప్రమాణ స్వీకారానికి రావాలని కెసిఆర్‌ను ఆహ్వానించారు.
కెసిఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పదకొండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు. కేంద్ర కేబినెట్లోని అందరికి చంద్రబాబు ఆహ్వానం పంపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు ఆహ్వానం పంపించనున్నారు. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ తదిర ముఖ్యనేతలను ఆహ్వానించనున్నారు.

రాహుల్ గాంధీతో చిరు, రఘువీరా భేటీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై వీరు రాహుల్‌తో చర్చించారు. సాయంత్రం 4.30కి రఘువీరా, చిరంజీవి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు.












Click it and Unblock the Notifications