'జగన్ కుట్రలు చూసి, అమెరికాలో బాబుకు భద్రత పెంపు, అరెస్ట్ తప్పదు'

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేస్తున్న కుట్రలు చూసి అమెరికాలో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచారని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం నాడు అన్నారు.

చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో ఇర్వింగ్ పోలీసులకు లేఖలు రాసిన వారు కచ్చితంగా జైలుకు పోతారని చెప్పారు. ఆస్తుల కేసులో ఎప్పుడు జైలుకు వెళ్తానోనని జగన్ ఆందోళనగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తోందని అతనికి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు అమెరికాకు వెళ్లింది ఫండ్స్ కోసం కాదని చెప్పారు. పెట్టుబడుల కోసమే వెళ్లారని తెలిపారు.

జగన్ గ్యాంగ్ పంపించింది

జగన్ గ్యాంగ్ పంపించింది

చంద్రబాబు అమెరికా పర్యటనకు విఘాతం కలిగించేలా ఆయనకు వ్యతిరేకంగా డల్లాస్‌లోని ఇర్వింగ్‌ పోలీసులకు వైసిపి అధినేత జగన్‌ గ్యాంగ్‌ తప్పుడు ఈ మెయిళ్లు పంపించిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంతకుముందు ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఎర్ర చందనం స్మగ్లర్లను చంపించారని, వసూళ్ల కోసమే అమెరికా వచ్చారని తప్పుడు మెయిళ్లు అమెరికాకు పంపారని, ఇది జగన్‌ దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్టని దుయ్యబట్టారు.

రాజద్రోహం

రాజద్రోహం

పెట్టుబడులను అడ్డుకోవడం ద్వారా యువతకు తీరని అన్యాయం చేయడానికి జగన్‌ సిద్ధపడుతున్నారని, అది రాజద్రోహమని, దుర్మార్గ చర్యని సోమిరెడ్డి మండిపడ్డారు. నేరపూరిత, అవినీతి నేపథ్యం ఉన్న వైసిపి ప్రవర్తన హద్దు మీరుతోందని, చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం, ఆ కుర్చీలో కూర్చోవడమే జగన్ లక్ష్యమని, రాష్ట్ర ప్రయోజనాలు వాళ్లకు అక్కర్లేదని సోమిరెడ్డి అన్నారు.

జగన్ కుట్రలు చూసి బాబుకు భద్రత పెంచిన అమెరికా

జగన్ కుట్రలు చూసి బాబుకు భద్రత పెంచిన అమెరికా

ఇతర దేశాల్లో చంద్రబాబుకు వస్తున్న స్పందన చూసి జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి తెగబడ్డారని సోమిరెడ్డి అన్నారు. వేలమంది ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో భయానకమైన మెయిల్స్‌ పంపి, అమెరికాలో ఆయన పర్యటనకు ఆటంకం కలిగించాలని ప్రయత్నించారని, వాళ్ల కుట్రను పసిగట్టిన అమెరికా పోలీసులు చంద్రబాబుకు భద్రత పెంచారన్నారు.

బాబు బాహుబలి, జగన్ భల్లాలదేవ

బాబు బాహుబలి, జగన్ భల్లాలదేవ

ఐయోవా రాష్ట్ర రాజధానిలో చంద్రబాబును స్వాగతించేందుకు వేలాదిగా తెలుగువారు తరలివచ్చారని, వారిని అదుపు చేసేందుకు అమెరికా ప్రత్యేక పోలీసు బలగాలు చెమటోడ్చాల్సి వచ్చిందని సోమిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును బాహుబలి అని అమెరికాలోని తెలుగువారు కీర్తిస్తున్నారని, భల్లాలదేవ, బిజ్జల దేవ తరహాలో జగన్‌ కుట్రలు, కుతంత్రాలు పన్నురుతున్నారని

తుని ఘటన మొదలు..

తుని ఘటన మొదలు..

తునిలో రైలు తగలబెట్టడం, విశాఖ విమానాశ్రయంలో బైఠాయించడం, మహిళా పార్లమెంటుపై దుష్ప్రచారం చేయడం, ప్రస్తుతం అమెరికాకు తప్పుడు మెయిళ్లు పంపడం అన్నీ దుర్మార్గ చర్యలేనని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌ అనుచరుల వీరంగాలు, అకృత్యాలు హద్దు మీరుతున్నాయన్నారు. ఇటువంటి నీచ రాజకీయాల్ని వైసిపి నేతలు ఇకనైనా మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+