వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ వాస్తవాలు, తట్టుకోలేకపోతున్న బాబు, రైతులు పెట్టిన భోజనం తినలేదని..'

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, తమ పార్టీ అధినేత వైయస్ జగన్ వాస్తవాలు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం మండిప

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, తమ పార్టీ అధినేత వైయస్ జగన్ వాస్తవాలు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం మండిపడ్డారు.

అక్వా ఫుడ్ పార్కు ఏర్పాటు పైన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదన్నారు. స్థానిక ప్రజల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత ప్రాంతాలపై ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సరికాదన్నారు.

<strong>టిడిపితో ముచ్చెమటలు, వైయస్ ఫ్యామిలికీ ప్రతిష్ట: జగన్ అప్రమత్తం</strong>టిడిపితో ముచ్చెమటలు, వైయస్ ఫ్యామిలికీ ప్రతిష్ట: జగన్ అప్రమత్తం

బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయన్నారు. వాస్తవాలు చెబుతుంటే ప్రతిపక్షాల పైన ఎదురు దాడి చేస్తున్నారన్నారు. రైతులు పెట్టిన భోజనం తినలేదని టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

Chandrababu is not digesting facts: YSRCP

తినే ప్రతి ముద్దను రైతును తలచుకొని తినే సంస్కారం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమకు నేర్పారని చెప్పారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు.

<strong>అభియోగాలు.. నాపై కేసు కొట్టి వేయండి: హైకోర్టుకు వైయస్ జగన్</strong>అభియోగాలు.. నాపై కేసు కొట్టి వేయండి: హైకోర్టుకు వైయస్ జగన్

ఆయన చూపిన లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. యనమల అనవసపు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. సత్య నాదెళ్లను తానే మైక్రోసాఫ్ట్ రంగాన్ని ఎంచుకోమని చెప్పానని, ఇక పీవీ సింధు తన వల్లే ఒలింపిక్స్‌లో పతకం సాధించిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.

English summary
YSRCP leader Buggana Rajendranath Reddy on Wednesday said that CM Chandrababu is not digesting facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X