చంద్రబాబుకు తొలి అడ్డంకి ? నేడు కుప్పం టూర్-కుదరదన్న పోలీసులు-అయినా టీడీపీ...

ఏపీలో కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించరాదని ప్రభుత్వం మొన్న అర్ధరాత్రి ఉత్తర్వలు ఇచ్చింది. వీటి ఆధారంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు చేసే పర్యటనను నిలిపేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాము సూచించిన చోటే సభలు పెట్టుకోవాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిని టీడీపీ పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు టూర్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గరాదని టీడీపీ నిర్ణయించింది.

కుప్పంలో చంద్రబాబు టూర్

కుప్పంలో చంద్రబాబు టూర్

టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు కుప్పం టూర్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి కుప్పంలోని మూడు మండలాల పరిధిలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న కందుకూరు, గుంటూరు ఘటనల్ని సాకుగా చూపుతూ పోలీసులు చంద్రబాబు టూర్ కు ఆంక్షలు విధించారు. తాము సూచించిన చోటే సభలు పెట్టుకోవాలని కోరారు. రోడ్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇరుకు సందుల్లో సభలు, రోడ్ షోలకు అనుమతి లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఇవాళ చంద్రబాబు టూర్ పై ఉత్కంఠ పెరుగుతోంది.

అనుమతి నిరాకరణ

అనుమతి నిరాకరణ

కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పలమనేరు సబ్ డివిజన్లోని మూడు మండలాల్లో చంద్రబాబు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. అయితే పోలీసులు ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన నోటీసులపై టీడీపీ నేతలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా పోలీసులు తీసుకోలేదని చెప్తున్నారు. అలాగే టీడీపీ నేతలతో పోలీసులు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో పోలీసులు చంద్రబాబు టూర్ కు అనుమతి నిరాకరిస్తున్నట్లు రాత్రి పది గంటల సమయంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టూర్ కొనసాగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

టూర్ కొనసాగుతుందన్న టీడీపీ

టూర్ కొనసాగుతుందన్న టీడీపీ

పలమనేరు డీఎస్పీ ఆంక్షలు, అనుమతి నిరాకరణ నేపథ్యంలో టీడీపీ వెనక్కి తగ్గుతుందని భావించినా అలా జరగలేదు. కుప్పంలో చంద్రబాబు టూర్ కు అనుమతి కోరామని, వివరాలు కూడా ఇచ్చామని, అయినా అనుమతి నిరాకరించారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో చంద్రబాబు టూర్ యథావిథిగా కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. పోలీసులు అడ్డుకుంటే అప్పుడు ఏం చేయాలన్న దానిపై టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేక ఎలా అడ్డుకుంటారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+