వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుల మాఫీ! జగన్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు: మహాకుట్ర అంటూ బాబు సంచలనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలపై విమర్శలు గుప్పించారు. శనివారం ఉదయం టీడీపీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Recommended Video

బాబుకి ముచ్చెమటలు పట్టిస్తున్న పవన్, జగన్ | Oneindia Telugu

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీ ఎంపీల బృందం ఈ రెండ్రోజులు కూడా ఢిల్లీలోనే ఉండాలని చెప్పారు.

వైసీపీని ఎవరూ నమ్మడం లేదు

వైసీపీని ఎవరూ నమ్మడం లేదు

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎవరూ నమ్మడం లేదని, ఆ పార్టీ అవిశ్వాస తీర్మానానికి స్పందన రావడం లేదని అన్నారు. తమ అవిశ్వాస తీర్మానానికి గంటల వ్యవధిలోనే పలు పార్టీలు సానుకూలంగా స్పందించాయని అన్నారు.

 మద్దతు కూడగట్టాలి

మద్దతు కూడగట్టాలి

టీడీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉండి.. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కూడగట్టాలని చంద్రబాబు తెలిపారు. అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుపట్టాలని, డివిజన్ అడగాలని స్పష్టం చేశారు.

 మహాకుట్రను బయటపెట్టాం

మహాకుట్రను బయటపెట్టాం

తాము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ నుంచి బయటికి రావడంపై స్పందించారు. జనసేన, వైసీపీ, బీజేపీల మహా కుట్రను బయటపెట్టామని చంద్రబాబు చెప్పారు.

కేసులు మాఫీనే..?

కేసులు మాఫీనే..?

కేసుల మాఫీ కోసమే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎంఓ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ అనుచరులు పీఓంలోనే ఉన్నారని.. ఇక రేపోమాపో జగన్‌పై కేసులు కూడా కొట్టేస్తారనే ప్రచారం జరుగుతోందని చంద్రబాబు అన్నారు.

కేంద్రం అన్యాయం చేసినా..

కేంద్రం అన్యాయం చేసినా..

ఇది ఇలా ఉండగా, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రం తమకు అన్యాయం చేసిందని ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కేంద్రం అన్యాయం చేసినా చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తూనే ఉన్నారని చెప్పారు. 15ఏళ్లపాటు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు మాట మార్చడం సరికాదని అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday lashed out at YSRCP president YS Jaganmohan Reddy in no confidence motion issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X