జగన్ దులిపిన బాబు: సింగపూర్‌కు భూమిపై క్లారిటీ, బాహుబలిని ఆస్కార్‌కు..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసిపిపై, ఆ పార్టీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టుకు కూడా వెళ్తోందని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి బాధ్యతను సింగపూర్ కన్సార్టియంకు అప్పగించడంపై క్లారిటీ ఇచ్చారు.

కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూసమీకరణను అడ్డుకోవాలని చూశారని వైసిపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రైతులు తనపై నమ్మకంతో 33వేల ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పారు. రాజధానిపై వైసిపి దుష్ప్రచారం చేస్తోందన్నారు.

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చివరకు కోర్టుకు కూడా వెళ్లారని వైసిపిపై చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని వైసిపి ఆరోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

chandrababu naidu

ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ విమర్శలు చేసిందన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని గతంలో తానే తీసుకు వచ్చానని చెప్పారు.

రాజధాని భూమి సీఆర్డీయే వద్దనే..

రాజధాని భూమిని సింగపూర్ కన్సార్టియంకు అప్పగించడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. భూమిని కన్సార్టియంకు అప్పగించడం లేదన్నారు. రాజధాని భూమి ఎప్పుడు సీఆర్డీయే ఆదీనంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు.

1691 ఎకరాల్లో 15 ఏళ్లలో మూడు దశల్లో అభివృద్ధి పనులు అప్పగిస్తామన్నారు. సింగపూర్ కన్సార్టియం రూ.2118 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంటుందని చెప్పారు. దశల వారీగా అభివృద్ధిని అప్పగిస్తామన్నారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన పేద రైతులకు పింఛన్లు ఇస్తామన్నారు. ప్రతిపక్షాలు మంచి పాలసీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, అది సరికాదన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. బాహుబలి సినిమాను ఆస్కార్‌కు సిఫార్సు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. బాహుబలి యూనిట్‌ను అమరావతి తీసుకు వచ్చి సన్మానిస్తామని చెప్పారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

- కే విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావడంపై హర్షం
- ఒలింపిక్ విజేత పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం.
- కొత్తగా 800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆమోదం.
- 25 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను గ్రేడ్ 1 పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ ఆమోదం.
- సింగపూర్ కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
- విశాఖ జిల్లా ఎండాడకు చెందిన సీసీఎల్‌ఏ ఉత్తర్వులు వెనక్కి
- బాహుబలి సినిమా యూనిట్‌కు అభినందనలు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Nara Chandrababu lashes out at YS Jagan for obstructing Development.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి