ఏపిలోనే ఎక్కువ: శిశుమరణాలపై చంద్రబాబు, 5వ్యాధులకు ఒకే వ్యాక్సిన్
చిత్తూరు: గత పదేళ్లలో దక్షిణాదిలో తల్లులు, పిల్లల మరణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో పెంటావాలెంట్ టీకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఓ చిన్నారికి ఆయన టీకా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిశుమరణాలను గణనీయంగా తగ్గించాల్సిన అవసరముందన్నారు. గర్భిణీలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నట్లు చెప్పారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, పెళ్లి వయసు విభాగాల్లో దక్షిణాదిలోనే వెనుకబడి ఉన్నామన్నారు.
చిన్న పిల్లల్లో ఐదు వ్యాధులకు ఒకే వ్యాక్సిన్ పని చేస్తుందని అన్నారు. కంఠసర్పి, కోరింత దగ్దు, ధనుర్వాతం, హైపటైటిస్-బి, హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా-బి వ్యాధుల నుంచి పెంటావాలెంట్ టీకా రక్షిస్తుందన్నారు. ఆధునిక కాలంలో ఆరోగ్యానికి చాలా ప్రాధన్యత ఉందన్నారు. రికార్డులు మోసే పని లేకుండా ఆశా కార్యకర్తలకు ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

గర్శిణీ స్త్రీలు సరైనా జాగ్రర్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని చంద్రబాబు అన్నారు. గర్భిణీ స్ర్తీలు తీసుకోవాల్సిన జాగ్రర్తలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని, అంగన్‌వాడీల ద్వారా గర్భిణీ మహిళలకు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
వైద్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం, ఆశా వాలెంటీర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
అనంతరం యాదమరి మండలం మోర్ధాన్‌పల్లి దగ్గర అమర్‌రాజా గ్రోత్ కారిడార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తిరుపతి కంటే మిన్నగా చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏడాదిలో జిల్లాకు హంద్రీనీవా నీళ్లను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications