ఏపి సిఎంగా 4 ఫైళ్లపై సంతకం చేయనున్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 8న ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఆయన నాలుగు ఫైళ్లపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, వృద్ధాప్య పింఛన్‌ను రూ. వెయ్యికి పెంపు, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, బెల్టు షాపుల రద్దు ఫైళ్లపై చంద్రబాబు నాయుడు సంతకాలు చేసే
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ప్రకటిస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి ఐదేళ్ల పాటు ఏపికి ప్రత్యేక హోదా అమలులో ఉండనుంది. ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రత్యేక హోదా అమలులోకి రానుంది. మార్చి 2న ప్రత్యేక హోదాకు యుపిఏ కేబినెట్ ఆమోదం తెలిపింది.

జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రత్యేక హోదా అమల్లోకి రానుంది. పన్నుల మినహాయింపు, నిధుల కేటాయింపునకు వీలుగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కల్పిస్తామంటూ ఫిబ్రవరి 20 తేదీన రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ మేరకు, కేంద్ర హోంశాఖ నోట్‌ను సిద్ధం చేసింది.
కాగా, ఏపికి ప్రత్యేక హోదాపై అనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ ఆమోదం తెలిపిందని మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా తెలిపారు. అపాయింటెడ్ డే తర్వాత నోటిఫికేషన్ అనుకున్నామని చెప్పారు. ఏపి అవసరాలపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కూడా యుపిఏ ప్రభుత్వం అనుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications